చంద్రబాబు దుస్థితే: 2024పై ప్రశాంత్ కిశోర్ జోస్యం..!!
పాట్నా: వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే దేశ రాజధానిలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. ఇవ్వాళ కోల్‌కతకు చేరుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిందీ సమావేశం. పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి.

మమతా బెనర్జీ-నితీష్ కుమార్-తేజస్వి యాదవ్ భేటీపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌ను చంద్రబాబుతో పోల్చారు. చంద్రబాబు దుస్థితే నితీష్ కుమార్‌కు పడుతుందని జోస్యం చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు.
అప్పటి చంద్రబాబు పాత్రను ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోషించే ప్రయత్నం చేస్తోన్నారని అన్నారు. ఆ ప్రయత్నాలు వృధా అవుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి గతంలో చంద్రబాబు కూడా దేశం మొత్తం తిరిగారని, అయినా ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను చంద్రబాబు అప్పట్లో సమావేశం అయ్యారని అన్నారు.
సొంత రాష్ట్రంలో గెలవాలనే ఆలోచన లేకుండా చంద్రబాబు దేశం మొత్తం తిరిగి ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అప్పటివరకు ఏపీలో అధికారంలో ఉన్న ఆయన- 2019 ఎన్నికల తరువాత ఓడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ కూడా బిహార్‌లో అధికారంలో ఉన్నారని, 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత చంద్రబాబులాగే ఆయనకు ఓటమి ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
#WATCH | On Bihar CM Nitish Kumar meeting several opposition leaders for 2024 election, Prashant Kishor talks about Former Andhra Pradesh CM N Chandrababu Naidu's attempt to unify Opposition in 2019 elections.
— ANI (@ANI) April 25, 2023
He further said "Nitish Kumar has 'langdi sarkaar' & must worry… pic.twitter.com/krLS1aASCR
ఏపీలో చంద్రబాబుకు పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా ఓడిపోయారని చెప్పారు ప్రశాంత్ కిశోర్. పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబుకు 2019 ఎన్నికల తరువాత దక్కిన స్థానాలు 23 అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయనకు పరాజయాలు ఎదురయ్యాయని, మూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు.
చంద్రబాబు లాగా ప్రస్తుతం బిహార్‌లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని, రాష్ట్రీయ జనతాదళ్ మీద ఆధారపడి ఉందని అన్నారు. నితీష్ ప్రభుత్వం ఊతకర్రల సహాయంతో నడుస్తోందని, ఇది ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబే తన రాష్ట్రం మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి దేశం మొత్తం తిరిగారని వ్యాఖ్యానించారు.

నితీష్ కుమార్ కూడా బిహార్ అభివృద్ధిపై కాకుండా ప్రతిపక్షాలను ఒకే గొడుగు కిందికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తే- చంద్రబాబులాగా ఓటమి తప్పదని ప్రశాంత్ కిశోర్ పరోక్షంగా హెచ్చరించారు. ఒక్క ఎంపీ కూడా లేని పార్టీ ఏకంగా ప్రధానమంత్రి పదవిపైనే దృష్టి పెట్టడం హాస్యాస్పదమని ఆయన నితీష్ కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications