వార్నీ.. బీహార్ గెలుపు వెనుక అసలు విషయం ఇదన్నమాట..!!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులని విజయాన్ని అందుకుంది.. జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. 202 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి మట్టికరిచింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 35 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ- 91, జేడీయూ- 81 స్థానాల్లో గెలిచాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా అయిదోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ చెందిన జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా నితీష్ కుమార్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని పేర్కొంది. దీని విలువ 14,000 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ మొత్తం కూడా ప్రపంచ బ్యాంక్ నిధులని స్పష్టం చేసింది. ఈ మొత్తం ఓట్లను గంపగుత్తగా కొన్నారని జన్ సూరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ విమర్శించారు.

Prashant Kishor s Party Claims Massive Vote-Buying Scheme in Bihar

ఈ ఏడాది జూన్ నుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేంత వరకు నితీష్ కుమార్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలను ఓట్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిందని, ఇందులో 14,000 కోట్ల రూపాయలు ప్రపంచబ్యాంక్ నిధులు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాలకు 10,000 రూపాయలు చొప్పున బదిలీ అయ్యాయని అన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ జరిగే ముందు రోజు వరకు ప్రజలకు ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు అందుతూనే ఉన్నాయని, నిరుపేద మహిళలను ప్రభావితం చేయడానికి ఈ మొత్తం సరిపోతుందని ఉదయ్ సింగ్ అన్నారు. అధికారంలోకి రావడానికి ప్రజా ధనాన్ని ఓట్లు కొనుగోలు చేయడానికి దుర్వినియోగం చేయకపోతే ఎన్డీఏ ఓడిపోయేదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పును డబ్బులతో ప్రభావితం చేశారని మండిపడ్డారు.

జన సూరాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పవన్ వర్మ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. 21,000 రూపాయల వరల్డ్ బ్యాంక్ నిధుల నుండి ఈ మొత్తం మళ్లించారని పేర్కొన్నారు. బీహార్‌లో ప్రస్తుతం ప్రభుత్వం చేసిన రుణభారం 4,06,000 కోట్ల రూపాయలుగా ఉందని, రోజువారీ వడ్డీకే 63 కోట్ల రూపాయలను కట్టాల్సి వస్తోందని, నితీష్ కుమార్ హయాంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీగా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+