దిల్లీలో 'జన్ సురాజ్ పార్టీ' ఏర్పాటుపై ప్రశాంత్ కిషోర్ సంచలనం..!

ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇటీవల బిహార్ లోని బంకిపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 1995 నుంచి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ బద్దలు కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 64,151 ఓట్లు సాధించిన పీకే.. బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ ను 19,324 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. అలా ఈ ఎన్నికలో పోటీ చేసిన పీకే ఎవరూ ఊహించని రీతిలో విజయం ఢంకా మోగించి బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూపు దేశ రాజధాని దిల్లీవైపు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు ఆదివారం దిల్లీలో జన్‌ సురాజ్‌ మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమకు పార్టీని విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దిల్లీలోగానీ ఇతర రాష్ట్రాల్లో గానీ పార్టీని విస్తరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని పేర్కొన్నారు.

జన్ సురాజ్ పార్టీకి సంబంధించిన మూలాలను ఇంకా ఇతర రాష్ట్రాల్లో బలంగా విస్తరించలేదని.. హడావుడిగా పార్టీని ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని తెలిపారు. కొత్త రాష్ట్రాల్లో దిల్లీ లాంటి ప్రాంతాల్లో అడుగు పెట్టడానికి విస్తృతమైన ఏర్పాట్లు, పటిష్టమైన కార్యాచరణ, సరైన వ్యక్తుల ఎంపిక అలాగే తగినంత సమయం కూడా ఉండాలని వివరించారు. ఈ మేరకు పీకే దిల్లీలో పర్యటించాలని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలని జన్ సురాజ్ పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, మద్దతుదారులు కోరుతున్న క్రమంలో ఆదివారం దిల్లీలో ఆయన సమావేశం నిర్వహించారు. దిల్లీలో రాజకీయంగా ఏదైనా ముందడుగు వేయడానికి కనీసం ఆరు నెలల పాటు గ్రౌండ్ వర్క్ అవసరం అని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ ఆరు నెలల సమయంలో కనీసం 50 వరకు మీటింగ్స్, ఇంటెరాక్టివ్ సెషన్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. దిల్లీలో స్థానిక సమస్యలపై అవగాహన కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

PrashantKishor Comments founder of the Jan Suraaj Party regarding the party s formation in Delhi

ఇక జన్‌ సురాజ్‌ పార్టీని 2024 అక్టోబర్‌ 2న ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్ లో స్థాపించారు. 2025 నవంబర్‌ లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన పార్టీ 243 స్థానాల్లో 238 చోట్ల అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 202 స్థానాలు గెలుచుకోగా ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘఠ్‌ బంధన్‌ 35 స్థానాలను సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+