దళిత యువతిపై అయిదుగురు అత్యాచారం..! అవమానంతో ప్రియుడి ఆత్మహత్య..!
జైపూర్/హైదరాబాద్ : మానవత్వం మంటగలిసి పోతోంది. సాటి మహిళ అనే జాలి, కనికరం లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు కొంత మంది మృగాళ్లు. మహిళ సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, కఠినమై శిక్షలు ఉంటాయని తెలిసినా సమాజంలో స్త్రీలపైన అకృత్యాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భర్త ముందే బార్యపై అత్యాచారం చేయడం, చిన్న పిల్లపై లైంగికంగా దాడులు చేయడం, కోరిక తీరిన తర్వాత అమానుషంగా హత్యచేయడం వంటి సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా జైపూర్ లో జరిగిన ఓ సంఘటన సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసింది. మహిళలు, బాలికలపై అత్యాచారం,హత్యలకు పాల్పడుతున్న వారికి ఉరిశిక్షల అమలుపై తీవ్ర చర్చ నడుస్తుండగానే రాజస్థాన్‌లో జరిగిన మరో అమానవీయ ఘటన కలకలం రేపింది. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేయడంతో గత నెలలో జరిగిన ఈ దారుణం వెలుగు చూసింది.ప్రేమికులైన దళిత యువతీ యువకులు జులై పదమూడవ తేదీన బైక్ పై వెడుతుండగా, ముగ్గురు దుండగులు వారిని కత్తులతో, రాడ్లతో అటకాయించారు. యువకుడిని కొట్టి, సెల్‌ఫోన్ లాక్కుని అతణ్ణి అక్కడినుంచి బలవంతగా పంపించేశారు. అనంతరం ఇరవై ఏళ్ల ప్రియురాలుని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కొనిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో ఇద్దరు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ పాశవిక కృత్యంతో ఆమెకు గర్భస్రావమైంది.

మరోవైపు ప్రియురాల్ని కాపాడలేకపోయానన్న ఆవేదనతో ఆ యువకుడు ఊర్లో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై పదమూడు రాత్రి బన్స్‌వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సునీల్, జితేంద్ర, వికాస్, విజయ్, పప్పు గుర్జార్‌గా గుర్తించామని బన్స్‌వారా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, ప్రభతి లాల్ తెలిపారు. నిందితుల్లో నలుగురిని ఆదివారం అరెస్టు చేయగా, ఒకరిని జూలై 26న అరెస్టు చేశామన్నారు.
యువకుడి తండ్రి, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు సహా, కిడ్నాప్, సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదుచేశామని డీఎస్‌పీ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుంగా ఉండాలంటే నింతులను బహిరంగంగా శిక్షించాలని బాదితుల కుంటుంబ సబ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications