Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెకెన్ టు సెకెన్ ఎయిరిండియా ఫ్లైట్ ప్రమాదం జరిగింది ఇలా: తాజా నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు

Air India flight crash: దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం అయింది. బ్లాక్ బాక్స్ లభించిన తరువాత కుట్ర కోణం సైతం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దిశగా విచారణ చేపట్టింది.

ఈ దుర్ఘటనపై ప్రస్తుతం విమాన ప్రమాద పరిశోధన బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూరో ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పలు అంశాలను ఇందులో పొందుపరిచింది. బ్లాక్ బాక్స్ డేటాను సైతం ఈ బ్యూరో విశ్లేషించినట్లు తెలుస్తోంది.

Preliminary report revels engine fuel switches were cut off before Air India flight crash in Ahmedabad

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన మూడు సెకన్ల తర్వాత, ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంజిన్ల వేగం తగ్గింది. 54,200 కిలో లీటర్ల ఇంధనంతో 213.4 టన్నుల బరువున్న విమానం ఎయిర్‌పోర్ట్ ప్రహరీ గోడను దాటేలోపే ఎత్తును కోల్పోయింది.

ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఇంధన సరఫరా స్విచ్‌లు ఒక సెకను వ్యవధిలో కటాఫ్ అయ్యాయి. రన్ నుండి కట్‌ ఆఫ్గా పడిపోయాయి. ఇది ఎలా? ఎందుకు జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయిన 26 సెకన్ల తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆరు సెకన్లలో విమానం ప్రమాదానికి గురైంది.

ఊహించని విధంగా ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు పైలట్లు దిగ్భ్రాంతికి గురైనట్లు ఏఏఐబీ నివేదిక వెల్లడించింది. పైలట్లలో ఒకరు- ఎందుకు ఆపావు.. అని మరొక పైలట్‌ను అడగడం.. దానికి మరో పైలట్ నేను అలా చేయలేదు.. అ సమాధానం ఇచ్చినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

టేకాఫ్ సమయంలో విమానం బరువు 2,13,401 కేజీలు. గరిష్టంగా 2,18,183 కిలోల బరువుతో టేకాఫ్ తీసుకోగల సామర్థ్యం దీనికి ఉంది. మధ్యాహ్నం1:38:39 సమయానికి విమానం గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని అందుకుంది. ఆ వెంటనే ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఇంధన సరఫరా స్విచ్‌లు ఒక సెకను వ్యవధిలో కట్‌ ఆఫ్ అయ్యాయి.

టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో వాటి ఫ్యాన్ల రొటేషన్ స్పీడ్ ఒక్కసారిగా తగ్గింది. ఫలితంగా విమానం ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) వెంటనే యాక్టివేట్ అయింది. లిఫ్ట్ ఆఫ్ కావడానికిప్రయత్నించింది. దానికి అనుగుణంగా ఇంధనం సరఫరా లేకపోవడంతో ప్రమాదానికి గురైంది.

విమానం ఎయిర్‌ పోర్ట్ ప్రహరీ గోడను దాటేలోపే ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది. 10 సెకన్ల తర్వాత అంటే 1:38:52 సెకెన్లకు ఒక ఇంజిన్ ఇంధన సరఫరా స్విచ్‌లు కట్‌ ఆఫ్ నుండి మళ్లీ రన్ స్థానానికి మారాయి. దీంతో ఇంధన సరఫరా తిరిగి ప్రారంభమైంది. నాలుగు సెకన్ల తర్వాత అంటే 1:38:52 సెకెన్లకు మరొక ఇంజిన్‌లో కూడా అదే జరిగింది.

ఇంజన్ 1లో ఇంధనం పునరుద్ధరణ కావడంతో అది తిరిగి వేగం పుంజుకోవడం ప్రారంభించేటప్పటికే పరిస్థితి చేయి దాటింది. తొమ్మిది సెకన్ల తర్వాత 1:39:05కు పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. దీనికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించారు కూడా. అప్పటికే విమానం కుప్పకూలింది. 1:39:11 సెకెన్లకు ఫ్లైట్ నుంచి డేటా స్తంభించిపోయింది.

టేకాఫ్ అయిన తర్వాత, విమానం రన్‌వే నుండి 0.9 నాటికల్ మైళ్ల (1.6 కిమీ) దూరంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌ను ఢీ కొట్టింది. విమానం ఎత్తును కోల్పోతున్న సమయంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ కాంపౌండ్ లోపల చెట్లు, ఒక చిమ్నీని ఢీకొట్టింది. ఆ తర్వాత బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ను ఢీ కొట్టినట్లు బ్యురో నివేదిక పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+