Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనంతా ఎలా ఉన్నావ్‌ ?.. రాష్ట్రపతి పలకరింపుతో మురిసిపోయిన ఉద్యోగి !!

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మరోసారి తన మంచి మనస్సు చాటుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను చేతల్లో చేసి చూపించారు. జనసమూహంలో కూడా గతంలో తన కింద పనిచేసిన ఉద్యోగిని గుర్తుపట్టి పేరుతో పిలవడమే కాకుండా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి ఈ విధంగా పాత రోజుల‌ను గుర్తు చేసుకుని ఆప్యాయంగా పలకరించడంతో సదరు ఉద్యోగి మురిసిపోయాడు. అంతటి పదవిలో ఉండి కూడా ముర్ము ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఒడిశాలో రాష్ట్రపతి పర్యటన..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సొంత రాష్ట్ర‌మైన ఒడిశాలో ప‌ర్య‌టించారు. ఈ మేరకు శాసనసభలో ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగిస్తూ ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఈ భవనంలో మళ్లీ నిలబడ్డ ఆ క్షణం ఎంతో భావోద్వేగాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. గతంలో ఇదే శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. మారు మూల గ్రామం నుంచి దేశ అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు సాగిన త‌న ప్ర‌స్థానాన్ని స్మరించుకొని ఎమోషనల్ అయ్యారు.

president-draupadi-murmu-recognize-ex-employee-with-name-at-odisha-tour

ఈ క్రమంలోనే తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో త‌న కార్యాల‌యం ఉన్న 11వ నెంబర్ చాంబ‌ర్‌ను రాష్ట్రపతి సంద‌ర్శించారు. అయితే ముర్మును చూసేందుకు ఉద్యోగులు, సహా అక్కడికి పెద్ద ఎత్తున చేరగా.. ఆ జనసమూహం మధ్యలో ఉన్న వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి పేరు పెట్టి పిలిచి, యోగ‌క్షేమాలు అడ‌గ‌డంతో అంతా ఆశ్చర్యపోయారు. అతనిని పేరు పెట్టి పిలిచి పలకరించడమే కాకుండా.. పిల్లల గురించి కూడా ఆరా తీశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఉద్యోగి ఎవరంటే..

అంతమంది జనంలో కూడా రాష్ట్రపతి గుర్తుపట్టి పలకరించిన ఉద్యోగి ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది. కాగా సదరు ఉద్యోగి పేరు అనంత చరణ్ బెహరా అని తెలుస్తోంది. ఆయన గ్రేడ్ -4 ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ద్రౌపదీ ముర్ము 2000 నుంచి 2004 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే అనంత చరణ్ ఆమె కార్యాల‌యంలో 'జమాదార్'గా ప‌నిచేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన రిటైర్డ్ అవ్వగా.. అసెంబ్లీకి ముర్ము వ‌స్తున్నార‌ని తెలిసి అక్క‌డికి వచ్చినట్టు బెహరా వెల్లడించారు. అనంతా ఎలా ఉన్నావ్‌? నీ కొడుకు, కూతురు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" అని రాష్ట్రపతి అడగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇన్నేళ్ల త‌ర్వాత కూడా రాష్ట్రపతి తనను గుర్తుపెట్టుకుని పిల‌వ‌డం త జీవితంలో ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నానని తెలిపారు. అంతే కాకుండా ముర్ము మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వారికి జీతాలు నగదు రూపంలో చెల్లించేవారని బెహరా అన్నారు. ముర్ము వేత‌నాన్ని అకౌంట్స్ విభాగం నుంచి తానే తీసుకొచ్చేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ మేడమ్ ఏమాత్రం మారలేదని ప్ర‌శంస‌లు కురిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+