వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పాలన: పార్లమెంటులో ప్రణబ్, ఏపీకి హోదా కోసం నేతల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేతి తమ ప్రభుత్వ లక్ష్యం. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నా. ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రాధాన్యత.

సమష్టి కృషితోనే అద్భుత పథకాలు సాధిస్తాం. ఏకాత్మత, మానవతా దృక్పథం అన్న దీనదయాళ్ ఉపాధ్యాయ ఆదర్శాల ఆధారంగా అభివృద్ధికి బాటలు వేస్తాం. జన్ ధన్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 13.2 కోట్ల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. గడిచిన తొమ్మిది నెలల్లో అభివృద్ధికి ఊతమిచ్చే సమగ్ర కార్యాచరణ ప్రారంభించాం.

Pranab Mukherjee

ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ లక్ష్యం. అభివృద్ధిపై రాష్ట్రాల మధ్య సానుకూల పోటీ ఉండాలి. జన్ ధన్ ఖాతాల్లో రూ.11 వేల కోట్లు జమయ్యాయి. ఎంపీల నిధుల్లో సగం స్వచ్ఛ భారత్‌‌కు కేటాయించాలి. జనవరి 1వ తేదీ నుండి నగదు బదలీ, పహల్ పథకం. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా పని చేస్తాం.

35 పథకాలను నగదు బదలీ కిందకు తీసుకు వస్తాం. రైతులకు భూ ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం. బిందు సేద్యం, తుంపర సేద్యం, గ్రీన్ హౌస్‌లకు ప్రాధాన్యత. అన్నదాత సుఖీభవ.. అనేది మా ప్రభుత్వ నినాదం. భూసేకరణలో నష్టపోయిన రైతులకు ఉపాధి కల్పిస్తాం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి.

త్వరలో ప్రధానమంత్రి ఇరిగేషన్ పథకం ప్రారంభిస్తాం. కౌలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తాం. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం. 2019 అక్టోబర్ లోగా స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని సాధిస్తాం. బేటీ బచావ్.. బేడీ పడావ్ ద్వారా బాలికల సంరక్షణ. మహిళల భద్రత కోసం హిమ్మత్ యాప్ ప్రారంభించాం.

దేశవాళీ ఆవుల అభివృద్ధి, రక్షణ కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ప్రారంభించాం. సమర్థ పాలన కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం. పన్నుల విధానాన్ని సరళీకరిస్తాం. ఎలక్ట్రానిక్ ఉత్తత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. అధికార వికేంద్రీకరణ ద్వారా సత్వర నిర్ణయాలు.

ప్రభుత్వ చర్యల వల్ల ద్రవ్యోల్భణం భారీగా తగ్గింది. బీమారంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచాం. జాతీయ, అంతర్జాతీయంగా నల్లధనంపై చర్యలు తీసుకుంటున్నాం. దేశాన్ని తయారీరంగంగా మార్చేందుకు మేకిన్ ఇండియా. మహిళల సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతల ప్లకార్డులు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు వద్ద ఏపీ కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఢిల్లీ పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో.. దిగ్విజయ్, రఘువీరా రెడ్డి, జేడీ శీలం, జైరామ్ రమేష్, కేవీపీ, సుబ్బిరీమి రెడ్డి, సీ రామచంద్రయ్య, చింతామోహన్, శైలజానాథ్, బాపిరాజు, పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు.

అంతకుముందు.. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలుకు ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించారు. సమావేశానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువరా రెడ్డి, మండలిలో కాంగ్రెస్ పక్ష నేత సీ రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు.

English summary
President during budget session: Govt will work for marginalised section
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X