రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని మోదీకి యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి.. ఆసక్తికర రాజకీయం
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరు ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో తమకు మద్దతు ఇవ్వాలంటూ మాట్లాడారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తనకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించడం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ మద్దతు కోరిన ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా
రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు పిటిఐ నివేదించింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన లని కోరారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు చంద్ర శేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేసిన 84 ఏళ్ల యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రముఖ నాయకుడు లాల్ కిషన్ అద్వానీని సైతం రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు కోసం సంప్రదించినట్టు సమాచారం.

హేమంత్ సోరెన్ మద్దతు కోరిన యశ్వంత్ సిన్హా ... ముర్ముకే మద్దతు ఇచ్చే అవకాశం
యశ్వంత్ సిన్హా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఫోన్ చేసి, రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా (హేమంత్ సోరెన్) పార్టీ-జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. యశ్వంత్ సిన్హా శుక్రవారం తన సొంత రాష్ట్రం జార్ఖండ్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తన మద్దతును ద్రౌపది ముర్ముకు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ద్రౌపది ముర్ము, హేమంత్ సొరేన్ ఇద్దరూ సంతాల్ అనే గిరిజన తెగకు చెందినవారు కావడంతో ఆయన ముర్ము వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.

జేడీఎస్ ముర్ముకు, సమాజ్వాదీ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు
మరోవైపు జెడిఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక సమాజ్వాది పార్టీ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సిన్హాకు మద్దతు ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ సైతం నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే యశ్వంత్ సిన్హా జూన్ 27న (సోమవారం) ప్రతిపక్ష అగ్రనేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సోనియాను, శరద్ పవార్ ను మద్దతు కోరిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము
యశ్వంత్ సిన్హా కంటే ముందు, ద్రౌపది ముర్ము కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులతో ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు కోరారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముర్ము శుక్రవారం పార్లమెంటులో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత ప్రతిపక్ష నేతలకు ముర్ము విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. జూలై 21 నాటికి ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశంలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ పడుతున్న యశ్వంత్ సిన్హా మరియు ద్రౌపది ముర్ము ఇద్దరికీ కేంద్రం భద్రత కల్పించింది. సిన్హాకు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వగా, ముర్ముకు జెడ్+ కేటగిరీ భద్రత కింద రక్షణ కల్పించింది కేంద్రం.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications