ఈనెల 29న భాగ్యనగరానికి రాష్ట్రపతి .. శీతాకాల విడిదికి ప్రత్యేక ఏర్పాటు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దక్షణాది విడిది ఖరారు అయింది. ఈనెల 29న హైదరాబాద్ కి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 29న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
శీతాకాల విడిది కోసం ఈనెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. రాష్ట్రపతి పర్యటనపై చర్చించారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కాడా ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో లను సీఎస్ ఆదేశించారు.

బొల్లారం రాష్ట్రపతి నివాసంలో బస
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 3వ తేది వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. రాష్ట్రపతి నిలయంలో ఎలాంటి సమస్యలు తలెల్లకుండా చూసుకోవాలని సీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా 24 గంటల నిరంతర సరఫరా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు.

.ప్రత్యేక ఏర్పాట్లు
అటు రాష్ట్రపతి నిలయంలో వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల మరమత్తు, బారీకేడింగ్ వంటి పనులు చేపట్టాలని కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. అటు రాష్ట్రపతి నిలయం వద్ద ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వహించేందుకు వైద్య బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బందిని నియమించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications