రాష్ట్రపతి ఎన్నిక: ఏకగ్రీవానికి కేంద్రం కసరత్తులు, పార్టీలతో జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు అధికార బీజేపీ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతిపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపడానికి భారతీయ జనతా పార్టీ ఆదివారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను నియమించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
నివేదిక ప్రకారం.. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపికపై ఏకాభిప్రాయానికి రావడానికి కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక ప్రకటనలో ఇద్దరు సీనియర్ నాయకులు ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర సభ్యులతో పాటు అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్ష యూపీఏ భాగస్వామ్య పార్టీలతో మాట్లాడుతారని తెలిపింది.

ఇద్దరు నేతలు త్వరలో ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ తెలిపింది.
గత 2017లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. అధ్యక్షుడిగా రామ్‌నాథ్ కోవింద్ ఎంపికను అప్పటికే ఖరారు చేసిన తర్వాత చివరి క్షణంలో మాత్రమే తమను పార్టీ సంప్రదించిందని వ్యాఖ్యానించాయి. కాగా, అప్పుడు కోవింద్ చేతిలో ఓడిపోయిన మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలు పోటీకి దిగాయి.
కాగా, అవసరమైతే రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న నిర్వహించి జూలై 21న ఓట్ల లెక్కింపు చేపడతారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ మీడియా సమావేశంలో తెలిపారు.
సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరుగుతుందని, ఓటింగ్‌లో ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓట్లు వేసిన గుర్తుకు కమిషన్ పెన్ను అందజేస్తుందని సీఈసీ పేర్కొంది. ఓటరు ఏదైనా ఇతర పెన్ను వాడితే ఆ ఓటు చెల్లదు.












Click it and Unblock the Notifications