చేదు వార్త: రైళ్లలో టీ, కాఫీ ధరలు పెరిగాయి, ఎంతంటే?
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. రైళ్లలో అందించే టీ, కాఫీల రేట్లు పెరిగిపోయాయి. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

అదేవిధంగా, కాఫీ ధరను కూడా రూ.10 లకు తగ్గకుండా ధరను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. రెడీమేడ్ స్టాండర్డ్ టీ మాత్రం రూ.5లుగానే ఉంటుందని.. సాధారణ టీ విషయంలో ధర పెరగదని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
లైసెన్స్ ఫీజు మార్పుల నేపథ్యంలో టీ ధరలు పెరిగాయని తెలిపింది. ఐఆర్‌సీటీసీ సుమారు 350 రైళ్లలో సేవలను అందిస్తోంది. రాజధాని, శతాబ్ది రైళ్లలో మాత్రం ఈ మార్పులు వర్తించవని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications