ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా RBI మాజీ గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం శక్తికాంత దాస్ నియామకం ప్రధానమంత్రి పదవి కాలంతో పాటు..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కో-టెర్మినస్ గా ఉంటుంది.
మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధాని మోదీకి మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. కాగా ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ గా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి, దేశం యొక్క తదుపరి ఆర్థిక పునరుద్ధరణ తో సహా క్లిష్టమైన ఆర్థిక సవాళ్ల మధ్య భారత్ ముందుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం పదవిని కూడా పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 24,2025 నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications