ప్రపంచంలోనే మీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తా, నమ్మండి, ప్రధాని నరేంద్ర మోదీ హామీ !

బెంగళూరు/బీదర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారు. శనివారం బీదర్ జిల్లాలోని హుమ్నాబద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కన్నడ బాషలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి తాను ఢిల్లీలో కుర్చున్న మీ ఇంటి బిడ్డను అనే డైలాగ్ కొట్టడంతో కన్నడిగులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ తాలుకాలోని చినకేరా క్రాస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. మొదట జగజ్యోతి బసణ్ణకు నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బసవేశ్వరనాడుకు నా నమస్కారం అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టారు. కర్ణాటకలో మరోసారి బీజేపీని మీరు ఆదరించాలని ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు.

 modi

ఇది కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు కాదని, ఈసారి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే కర్ణాటకను నెంబర్ వన్ చేస్తామని, కర్ణాటక నెంబర్ వన్ కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కర్ణాటకలో వచ్చే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకను నెంబర్ వన్ చేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు.

నేను బీదర్ రావడం చాలా సంతోషంగా ఉంది, కర్ణాటకకు బీదర్ కిరీటం లాంటిది, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం బీదర్ అభివృద్ది కోసం, ఈ ప్రాంతంలో నీటిపారుదల పనుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. బీదర్ తో పాటు కర్ణాటకలోని ప్రతిమూలలో ఉన్న ప్రాంతాలను డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ది చేస్తుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని మోదీ అన్నారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వలనే కేంద్రంలో, కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆదరించకూడదని, రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు.

 modi-

రైతుల అభివృద్ది కోసం పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో రైతులు అనేక లాభాలు పొందారని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 6 వేలు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కలిపి రైతులకు ప్రతినెల రూ. 10 వేలు అందుతోందని, రైతులకు అన్ని విదాల ఆదుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక గ్యారెంటీ స్కీమ్ లు ప్రకటించిందని, అయితే రైతుల ఖాతాల్లో ఇంతరకు డబ్బులు మాత్రం పడలేదని, కాంగ్రెస్ పార్టీలో చరుకుగా ఉంటూ ఆ పార్టీకి భజన చేస్తున్న నాయకుల అకౌంట్లలో మాత్రమే డబ్బులు జమ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.

కర్ణాటకలోని రైతులకు కాంగ్రెస్. జేడీఎస్ పార్టీల వలన ఎలాంటి లాభం లేదని, రైతులు బీజేపీని ఆదరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవిచేశారు. నేను ఢిల్లీలో కుర్చున్న మీ ఇంటి బిడ్డను, మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందు ఉంటానని హామీ ఇస్తున్నా, దయచేసి కర్ణాటకలో బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వాలని, కర్ణాటను ప్రపంచంలో నెంబర్ వన్ చేసే బాధ్యత తనదే అని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కన్నడిగులకు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+