మోడీ రచించిన సప్తపది: ఈ ఏడు సూత్రాలతో కరోనా పరార్: తప్పకుండా అనుసరించాలని పిలుపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ పొడిగింపుపై నెలకొన్న సస్పెన్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెరదించారు. కరోనాను తరిమి కొట్టడానికి లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితులను మరింత కఠినంగా మార్చాల్సి ఉంటుందని అన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 20వ తేద తరువాత కొద్దిగా వెసలుబాటు లభించే అవకాశం లేకపోలేదని చెప్పారు.

మోడీ సూచించిన సప్తపది:

మోడీ సూచించిన సప్తపది:

కరోనా వైరస్‌ను జయించడానికి ప్రధానమంత్రి ఏడు సూత్రాలను సూచించారు ఈ సప్తపదిని అనుసరించడం ద్వారా కరోనాను తరిమి కొట్టవచ్చని అన్నారు. వాటిని నిబద్ధతతో, చిత్తశుద్ధితో పాటించాలని అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తాము ఈ గండం నుంచి గట్టెక్కగలుగుతామని చెప్పారు. భారత్ మొత్తం కరోనా వైరస్‌పై పోరాడుతోందని, మిగిలిన దేశాలతో పోల్చుకుంటే దాన్ని అడ్డుకోవడానికి దేశం చేసిన ప్రయత్నాల్లో ప్రతి భారతీయుడు కూడా భాగస్వామి అని అన్నారు.

ఆ ఏడు సూత్రాలివే..

ఆ ఏడు సూత్రాలివే..

1. వయోధిక వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని నరేంద్ర మోడీ సూచించారు. ప్రతి ఇంట్లోనూ వయోధిక వృద్ధులు ఉంటారని, వారు గడప దాటి బయటికి రాకుండా చూసుకోవాలని అన్నారు. అనారోగ్యానికి గురైన వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి ముందుండాలని అన్నార. 2. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్, లాక్‌డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. 3. ప్రతి పౌరుడు కూడా తమ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చెప్పారు. దీనికోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలను పాటించాలని అన్నారు. 4. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఉద్దేశించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను తప్పనసరిగా డౌన్‌లోడ్ చేయాలని, తోటి వారితో కూడా డౌన్‌లోడ్ చేయించాలని అన్నారు. 5. పేదల రోజువారీ అవసరాలు, భోజనావసరాలను తీర్చడానికి ముందుకు రావాలని అన్నారు. 6. ఉద్యోగాలను తొలగించడాన్ని అడ్డుకోవాలని, తాము పనిచేసే సంస్థలు ఉద్యోగాలను తొలగించకుండా చూడాలని చెప్పారు. 7. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను ఆదరించాలని, వారిని గౌరవించాలని అన్నారు.

ఈ సప్తపదులను అనుసరించడం ద్వారా..

ఈ సప్తపదులను అనుసరించడం ద్వారా..

ఈ ఏడు సూత్రాలను అనుసరించడం ద్వారా కరోనా వైరస్‌ను పారద్రోలవచ్చని అన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని అన్నారు.లాక్‌డౌన్‌ను పొడిగించాలనే దేశ ప్రజలందరి నుంచీ ఒకే ఒక్క సందేశం అందిందని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించబోతున్నామని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లాగే కొనసాగించాల్సి ఉంటుందని సూచించారు. కరోనాను ఓడించడానికి కొత్త ప్రాంతాలను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వ్యక్తికి చేరకూడదని, మరిన్ని సమస్యలను రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.

Recommended Video

    Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+