యాభై మంది విద్యార్థులను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్...
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు వారిపై వేధింపులకు గురయ్యాడు. ఈ ఘటన ఛండీగఢ్‌లో చోటుచేసుకుంది. జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో యాభై మంది విద్యార్థులను లైంగికంగా హింసించాడు ఆ పాఠశాల ప్రిన్సిపాల్. ఈ విషయం నేరుగా ఆ విద్యార్థులే చెప్పినా, ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ పోలీసులపై సీరియస్ అయ్యింది.
చండీగఢ్‌లోని జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులు తమ ప్రిన్సిపాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రిన్సిపల్ తమపై లైంగికంగా వేధించాడని ఆరోపించించారు. ఫిర్యాదు చేశారు. అయినా ఆ ఫిర్యాదులను తేలికగా తీసిపాడేశారు. ఫిర్యాదులను పట్టించుకోకపోవడంపై హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ పోలీసులను ప్రవర్తను తీవ్రంగా ఖండించింది.

60 లిఖితపూర్వక ఫిర్యాదులు...:అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్‌పై స్వయంగా విద్యార్థినుల నుండి మాకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 మంది విద్యార్థినులు నేరుగా ప్రిన్సిపల్ చేతిలో శారీరక వేధింపులకు గురయిన బాలికల ఫిర్యాదులు చేశారు. మిగిలిన పది మంది అమ్మాయిలు, ప్రిన్సిపాల్ ఇలాంటివి పనులు చేయడం తమకు తెలుసని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు చేసిన వారందరూ మైనర్లనేనని భాటియా తెలిపారు. అయితే పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదులను సెప్టెంబర్ 14నే పోలీసులకు పంపామని ఆమె చెప్పారు.
పోలీసుల విధానాన్నితప్పుబట్టిన రాష్ట్ర మహిళా కమిషన్...:అయితే, మొదట్లో కొంతమంది విద్యార్థినుల నుండి సెప్టెంబర్ 13నే ఫిర్యాదును స్వీకరించి, ఆ మరుసటి రోజు పోలీసులకు అ అందజేశామని భాటియా అన్నారు. అయితే, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 29 వరకు, పోలీసులు దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని భాటియా తెలిపారు. ఈ విషయంలో జింద్ పోలీసుల విధానాన్ని ఆమె తప్పు పట్టారు. ఆ విద్యార్థులు మమ్మల్ని మళ్లీ సంప్రదించారు. దీంతో పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాం. ఆ తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆమె అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో నిందితుడు తప్పించుకున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. జింద్ జిల్లాలోని పోలీసులు సోమవారం ప్రిన్సిపాల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354-ఏ, 341, 342, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) కింద కేసు నమోదు చేశారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ మహిళా కమిషన్‌కు తమ కష్టాలను వివరిస్తూ లేఖలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications