singer: మొన్న పరిటాల రవి హంతకులు, నేడు సింగర్ సిద్దూ హంతకులు, సెంట్రల్ జైల్ స్కెచ్ తో ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో కొందరు నిందితులు అప్పట్లో జైలుకు వెళ్లారు. సేమ్ సీన్ మరోసారి మళ్లీ ఇప్పుడు రిపీట్ కావడం కలకలం రేపింది.
పంజాబ్/న్యూఢిల్లీ: బయట హత్యలు జరగడటం సర్వసాధారణం. ఎప్పుడు ఎందుకు హత్యలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. హత్యలు, నేరాలు చేసిన వారిని జైల్లో పెట్టి వాళ్ల బుద్ది మారేలా చేస్తారు. జైలుకు వెళ్లిన చాలా మంది వాళ్ల పద్దతులు మార్చుకుని బయటకు వచ్చి మంచి జీవితం గడుపుతున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో కొందరు నిందితులు అప్పట్లో జైలుకు వెళ్లారు. జైల్లో ఉండగానే కొందరు నిందితులు జైల్లోనే హత్యకు గురైనారు. సేమ్ సీన్ ఇప్పుడు మరోసారి మళ్లీ రిపీట్ అయ్యింది. ఫేమస్ సింగర్ హత్య కేసులో జైల్లో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితులను అతి దారుణంగా అదే జైల్లో హత్య చెయ్యడం కలకలం రేపింది. నిందితులు నోరు విప్పితే మొదటికే మోసం వస్తోందని సింగర్ హత్య కేసులోని ప్రధాన నిందితులు హత్య చేసిన వారిని జైల్లో చంపించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పరిటాల రవి హంతకుడు మొద్దు శీను ?
మ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో కొందరు నిందితులు అప్పట్లో జైలుకు వెళ్లారు. జైల్లో ఉండగానే కొందరు నిందితులు జైల్లోనే హత్యకు గురైనారు. పరిటాల రవి హత్య కేసులో అరెస్టు అయిన శీను అలియాస్ మొద్దు శీనును సెంట్రల్ జైల్లోనే ఓం ప్రకాష్ అనే నిందితుడు అతి దారుణంగా హత్య చేశాడు. పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను కీలకపాత్ర వహించాడు. అలాంటి మొద్దు శీను సెంట్రల్ జైల్లో హత్యకు గురి కావడం కలకలం రేపింది. మొద్దు శీనును హత్య చేసిన ఓం ప్రకాష్ ను 2016లో విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యలతో బాధపడుతూ 2020 జులై 27వ తేదీన విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

ఫేమస్ సింగర్ దారుణ హత్య
పంజాబీ ఫేమస్ సింగర్ సిద్దూ మూసేవాలాకు ఆ రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. 2022 మే 29వ తేదీన సింగర్ సిద్దూ మూసేవాలాను అతి దారుణంగా హత్య చేశారు. సింగర్ సిద్దూ మీద 28కి రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. పంజాబ్ లో మాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే సింగర్ సిద్దూకు ఉన్న సెక్యూరిటీని వెనక్కి తీసుకుంది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం సెక్యూరిటీని వెనక్కి తీసుకున్న మరుసటి రోజే సింగర్ సిద్దూను అతి దారుణంగా కాల్చి చంపేశారు.

జైల్లో సింగర్ సిద్దూ హంతకులు
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాల హత్య కేుల మన్మోహన్ సింగ్ అలియాస్ మోహ్న, మన్ దీప్ సింగ్ అలియాస్ తుపాన్ బటాలా, కేశవ్ తదితరులను అరెస్టు చేసిన పోలీసులు పంజాబ్ లోని టార్న్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి సిద్దరూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అదే జైల్లో విచారణ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. మాకు బెయిల్ మంజూరు చెయ్యాలని నిందితులు కోర్టును ఆశ్రయించినా వారికి బెయిల్ మాత్రం చిక్కలేదు.

సెంట్రల్ జైల్లోనే ఇద్దరిని లేపేశారు
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు జైల్లో జరిగిన గ్యాంగ్వార్‌లో దారుణ హత్యకు గురైనారు. గోయింద్వాల్ జైలులో ఆదివారం రెండు ముఠాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సమయంలో సిద్ధూ మూసేవాలా కేసులో నిందితులుగా ఉన్న మన్‌దీప్ సింగ్ తూఫాన్, మన్మోహన్ సింగ్ మోహనా దారుణ హత్యకు గురైనారు. ఈ కేసులో మరో నిందితుడు కేశవ్ కు తీవ్రగాయాలై అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

సెంట్రల్ జైల్లో ఆయుధాలు ఎక్కడివి ?
సింగర్ సిద్దూ హత్య కేసులోని ముగ్గురు నిందితుల తలలపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన ముగ్గరిని ఆసుపత్రికి తీసుకు వెళ్లే సమయానికే ఇద్దరి ప్రాణాలు పోయాయని పోలీసులు అంటున్నారు. మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తరణ్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యాధికారి డాక్టర్ జగ్జిత్ సింగ్ తెలిపారు. ప్రముఖ గాయకుడు ముసేవాలా హత్య సమయంలో గ్యాంగ్‌స్టర్ మన్‌దీప్ సింగ్ స్టాండ్‌బై షార్ప్ షూటర్ అని ఆరోపణలు ఉన్నాయి.

ఆ భయంతో జంట హత్యలు జరిగాయా ?
జైల్లో హత్యకు గురైన మన్ దీప్ సింగ్ పంజాబ్ లోని పేరుమోసిన గ్యాంగ్ స్టర్ జగ్గు భగవాన్ పూరియా అనుచరుడు అని పోలీసు అధికారులు తెలిపారు. అయితే సింగర్ సిద్దూ హత్య కేసులోని ప్రధాన నిందితులు ఎక్కడ కోర్టులో తమ పేర్లు బయట పెడుతారో అనే భయంతో ఇద్దరిని సెంట్రల్ జైల్లోనే హత్య చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్ లో ఇటీవల నేరాలు ఎక్కువ కావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications