Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లల తల్లి మీద కామాంధుడి వ్యామోహం, బస్ స్టాండ్ లో పోట్రోల్ పోసి నిప్పంటించిన బస్సు కండెక్టర్ !

చెన్నై/ కడలూరు: వివాహం చేసుకుని భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మహిళ మీద కన్నేసిన ఓ బస్సు కండెక్టర్ ఆమెను లొంగదీసుకోవాలని విఫలయత్నం చేశాడు. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని, నిన్ను ప్రేమించడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన మహిళ మీద వన్ సైడ్ లవర్ పగ పెంచుకున్నాడు. బస్ స్టాండ్ లో అందరూ చూస్తున్న సమయంలో మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు ఆమెను సజీవదహనం చెయ్యాలని విఫలయత్నం చేశాడు.

 ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలి టౌన్ షిప్, 21 లేన్ ప్రాంతంలో జాన్ విక్టర్, సలోమి (25) దంపతులు నివాసం ఉంటున్నారు. జాన్ విక్టర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జాన్ విక్టర్, సలోమి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త జాన్ విక్టర్, ఇద్దరు పిల్లలతో కలిసి సలోమి సంతోషంగా జీవితం గడుపుతోంది.

రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం

రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం

కడలూరులోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో సలోమి ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు ఉదయం టౌన్ షిప్ నుంచి ప్రైవేట్ బస్సులో సలోమి కడలూరులోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికి వెలుతోంది. ఉద్యోగానికి సరైన సమయంలో చేరుకోవాలంటే ఆ ఒక్క ప్రైవేటు బస్సు మాత్రమే సలోమికి అందుబాటులో ఉంది.

బస్సు కండెక్టర్ వ్యామోహం !

బస్సు కండెక్టర్ వ్యామోహం !

ప్రైవేట్ బస్సులో సందరమూర్తి కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం సుందరమూర్తి పని చేస్తున్న ప్రైవేటు బస్సులోనే సలోమి ఉద్యోగం చెయ్యడానికి కడలూరు వెలుతోంది. ఆ సమయంలో సుందరమూర్తి సలోమి మీద వ్యామోహం పెంచుకున్నాడు. సలోమితో మాట్లాడటం, ఆమెతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.

సారీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు !

సారీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు !

ఓ సారి నీను నిన్ను ప్రేమిస్తున్నానని సుందరమూర్తి సలోమికి చెప్పాడు. అయ్యో సారీ సర్, నాకు పెళ్లి అయ్యింది, భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారని, ప్రేమలు, దోమలు ఏమీ లేవని సలోమి సుందరమూర్తికి నచ్చచెప్పింది. అయితే సుందరమూర్తి మాత్రం సలోమిని లొంగదీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కండెక్టర్ సుందరమూర్తి చేష్టలతో సలోమి విసిగిపోయింది. ఎక్కడ భర్తకు చెబితే లేనిపోని గొడవలు వస్తాయో అంటూ సలోమి భయపడింది.

 బస్ స్టాండ్ లో పెట్రోల్ పోసి నిప్పంటించి !

బస్ స్టాండ్ లో పెట్రోల్ పోసి నిప్పంటించి !

ఇటీవల సలోమి కండెక్టర్ సందరమూర్తితో మాట్లాడటం నిలిపివేసింది. తనకు లొంగలేదని సలోమి మీద వన్ సైడ్ లవర్ సుందరమూర్తి కక్ష పెంచుకుని మరింత రగిలిపోయాడు. శుక్రవారం సలోమి బస్సులో వడలూరు చేరుకుంది. తరువాత బస్సు దిగిన సలోమి ఆఫీస్ కు నడుచుకుంటూ బయలుదేరింది. ఆ సమయంలో సలోమిని వెంబడించిన సుందరమూర్తి తన వెంట క్యాన్ లో తీసుకెళ్లిన పెట్రోల్ ఆమె మీద పోశాడు.

Recommended Video

    APSRTC Launches Chalo APP | ఇక ఆర్టీసీ ప్రయాణం.. మరింత సుఖం! | Oneindia Telugu
     మృత్యువుతో పోరాటం

    మృత్యువుతో పోరాటం

    పెట్రోల్ పోసి నిప్పంటించడంతో సలోమి శరీరం మొత్తం మంటలు వ్యాపించాయి. బస్ స్టాండ్ లో అందరూ చూస్తున్న సమయంలో సలోమి మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు పరుగు తీశారు. తీవ్రగాయాలైన సలోమిని కురింజిపాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరీరం దాదాపుగా కాలిపోవడంతో సలోమి మృత్యువుతో పోరాడుతోంది. సలోమి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని, సుందరమూర్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కడలూరు పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+