జమిలికి కేంద్రం డెడ్ లైన్ - ఎన్నికలపై బిగ్ స్కెచ్..!!

కేంద్రం అనుకున్న విధంగానే ముందుకు వెళ్తోంది. జమిలి పైన వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జమిలి బిల్లును అభ్యంతరాల నడుమ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ప్రతిపక్షాలు జేపీసీ కోసం డిమాండ్ చేస్తున్న వేళ.. ప్రభుత్వమే జేపీసీ ప్రకటన చేసింది. ఇప్పుడు 31 మందితో ఉభయ సభ ల సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కానుంది. నివేదిక కోసం డెడ్ లైన్ ఖరారు చేసిన కేంద్రం .. ఎన్నికల నిర్వహణ పైన నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

31 మందితో కమిటీ
జమిలి ఎన్నికల బిల్లు కోసం కేంద్రం 90 రోజుల గడువు నిర్ణయించింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేస్తూనే.. సమయం నిర్దేశించింది. ఇందు కోసం ఉభయ సభల్లోని సభ్యు లకు అవకాశం ఇవ్వనుంది. పార్టీల నుంచి వచ్చిన పేర్లను కమిటీలో నియామకం చేయనున్నారు. స్పీకర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి 90 రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తో పాటు మనీష్ తివారీ, సుఖ్‌దేవ్‌ భగత్‌, రణదీప్‌ సూర్జేవాలా పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.

Priyanka Gandhi expected to be part of the JPC tasked with examining the One Nation One Election bills

పార్టీల ప్రతినిధులుగా
బీజేపీ నుంచి ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, నిశికాంత్ దుబే పేర్లును ప్యానెల్ సభ్యులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీఎంసీ నుంచి ఇద్దరి పేర్లను సిఫార్సు చేసారు. కల్యాణ్‌ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే పేర్లు దాదాపు ఖరారయ్యాయి. శివసేన నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే, జేడీయూ నుంచి సంజయ్ ఝా తో పాటుగా డీఎంకే నుంచి సెల్వ గణపతి, పీ వీల్స్ పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 31 మంది ఉండే ఈ కమిటీ లో లోక్ సభ నుంచి 21, రాజ్యసభ నుంచి పది మంది ఉండనున్నారు.

90 రోజుల సమయం
జేపీసీకి సంబంధించి సభలో నిర్ణయం జరగటంతో ఈ కమిటీ ఏర్పాటు పైన స్పీకర్ ప్రకటన చేయనున్నారు. జమిలి బిల్లు పరిగణలోకి తీసుకునే అంశం పైన ఓటింగ్ జరిగింది. 360 మంది ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటింగ్ చేసారు. ఇక, ఇప్పుడు జేపీసీ తమ నివేదిక ఇచ్చిన తరువాత సభలో చర్చించి.. బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నించనుంది. ఇక, ఎన్నికల నిర్వహణ పైన సభలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+