Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక్కడి నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్న చిన్న మేడమ్ ?, లేకుంటే తెలంగాణ సేఫ్ !

లోక్‌సభ ఎన్నికల తేదీని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం అభ్యర్థులు ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారు. కర్ణాటకలోని తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని ప్రచారం సాగింది, అయితే కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు దానిని ఖండించారు.

ప్రస్తుతం ప్రియాంక గాంధీ కర్ణాటకలోని కొప్పళ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొప్పళ నుంచి పోటీ చేస్తారనే వార్త వైరల్‌గా మారింది. ఏఐసీసీ వర్గాలు, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండానే సర్వే నిర్వహించారని తెలిసింది.

Priyanka Gandhi is getting ready to contest from Koppala Lok Sabha constituency in Karnataka.

ప్రియాంక గాంధీ పోటీ చెయ్యడానికి కొప్పళ సేఫ్ అని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు చిన్న మేడమ్ పొటీ చెయ్యడానికి కోప్పళ లోక్ సభ నియోజక వర్గం ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కొప్పళలో పోటీ చేయలేకపోతే తెలంగాణ కూడా ప్రియాంక గాంధీకి మరో ఆప్షన్ కూడా ఉందని కర్ణాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ప్లీజ్‌ కమ్‌ టూ కొప్పల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొప్పుళ నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ కు చెందిన కొందరు సీనియర్ నేతలను ఇప్పటికే ఎక్స్‌లో ప్రియాంక గాంధీనికి ఆహ్వానించడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ధృవీకరించలేదు. దీనిపై స్థానిక నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొప్పళ సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు కర్డి సంగన్న బీజేపీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.

కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు పథకాలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదనపు ప్రయోజనం చేకూరుస్తాయని, ఇప్పటికే ఆ పళకాల వలన తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే కోప్పళలో సీక్రేట్ సర్వే చేయించిన విషయం స్థానిక కాంగ్రెస్‌ వర్గాలకు తెలియదని సమాచారం.

అయితే తమ అధినేత్రి ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అధిక మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తామని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ హైకమాండ్ కు హామీ ఇచ్చారు. కొప్పళ కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉంది. మొత్తం 8 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ 6 నియోజ‌క‌వ‌ర్గాలు గెలుపొంద‌డంతోపాటు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్రియాంక‌ గాంధీకి కొప్ప‌ళ వందకు వంద శాతం సేఫ్ నియోజ‌క‌వ‌ర్గం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు జోస్యం చెబుతున్నారు.

Priyanka Gandhi is getting ready to contest from Koppala Lok Sabha constituency in Karnataka.

గతంలో ఇందిరా గాంధీ కర్ణాటక నుంచి పోటీ చేసి రాజకీయ పునర్జన్మ పొందగా, సోనియా గాంధీ 1999లో బళ్లారి నుంచి పోటీ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కొప్పళ చాలా అనువైన ప్రదేశం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొప్పళలో సీఎం సిద్ధరామయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయి ఓట్లు రాబట్టడం సులువవుతుందనే లెక్క కూడా ఉంది.

ప్రియాంక గాంధీ కొప్పళ నుంచి పోటీ చేస్తే కర్ణాటకకు వరం అని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సభ్యులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని కొప్పళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కర్ణాటక నుంచి పోటీ చేసే జాతీయ నేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా అన్నారు. కర్ణాటక సీనియర్ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ ఈ వార్తలపై వ్యాఖ్యానించడం సాధ్యం కాదని, ఈ వార్త అధికారికం కాదని, కొప్పళలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాను కచ్చితంగా చెప్పలేమని చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు గందరగోళంలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+