యూపీలో ప్రియాంక విన్నూత్న ప్రచారం-ఆడపిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలా రిస్ట్ బ్యాండ్ల పంపిణీ
యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నాలుగో దశకు చేరుకుంది. ఇప్పటికే అధికార బీజేపీకీ, విపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో మరో విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువస్ధానాలు గెల్చుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో ప్రియాంక గాంధీ ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకుని మహిళల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూపీలో మహిళలపై అఘాయిత్యాల అంశాన్ని అజెండాగా మార్చుకుని ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తున్న ప్రియాంక గాంధీ.. ఈసారి వారికి ఎక్కువ టికెట్లు కూడా కేటాయించారు. అంతే కాదు ఇప్పుడు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తిప్పికొట్టాలని వారికి పిలుపునిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం మహిళలకు రిస్ట్ బ్యాండ్లను ఆమె పంచుతున్నారు. ఈ రిస్ట్ బ్యాండ్లపై లడ్ కీ హూ లఢ్ భీ సక్తీ హూ (నేను ఆడపిల్లనే అయినా పోరాడగలను కూడా) అనే నినాదంతో కూడిన రిస్ట్ బ్యాండ్లను ప్రియాంక ఇప్పుడు మహిళలకు అందిస్తున్నారు.

Recommended Video
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచార సమయంలో ఉత్సాహంగా అడుగులేస్తూ తన చుట్టూ ఉన్న కార్యకర్తలతో పాటు ప్రజల్ని కూడా ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోలో ప్రియాంక యువతులు,మహిళలకు 'లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్' రిస్ట్ బ్యాండ్‌లను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ తెలిపారు.గాంధీ రోడ్ షో రోజంతా లక్నోలోని పెద్ద ప్రాంతాలను కవర్ చేయడానికి షెడ్యూల్ చేసినట్లు ఆయన వెల్లడించారు. లక్నోలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి పట్టున్న మోహన్‌లాల్‌గంజ్ మినహా మిగిలిన అన్ని స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈసారి వీటిలో కొన్ని అయినా గెల్చుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.












Click it and Unblock the Notifications