పాలస్తీనా కు ప్రియాంక గాంధీ సంఘీభావం-ఈసారి బ్యాగ్ తో పార్లమెంట్లో..!
వయనాడ్ నుంచి తాజాగా ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి పాలస్తీనా విషయంలో తన సంఘీభావం చాటుకున్నారు. ఇప్పటికే పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం దురాగతాలను విమర్శిస్తున్న ప్రియాంక గాంధీ ఈసారి ఓ ప్రత్యేక బ్యాగ్ తో పార్లమెంట్ లో కనిపించారు. దానిపై పాలస్తీనా పేరు రాసి ఉంది. దీంతో పార్లమెంట్ లో ఇతర ఎంపీలంతా ప్రియాంకను ప్రత్యేకంగా గమనించడం కనిపించింది.
ఇవాళ ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో పాలస్తీనా పేరు రాసి ఉన్న ఓ ప్రత్యేక బ్యాగ్ ధరించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కనిపించారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటికే తన స్వరాన్ని పెంచుతున్న ప్రియాంక.. ఇవాళ ఆ దేశానికి సంఘీభావంగా నేరుగా బ్యాగ్ తగిలించుకుని తిరిగారు. తాజాగా వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంకను అభినందించేందుకు ఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం అధికారులు ఆమెను పిలిపించారు.

ఈ ఏడాది జూన్‌లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును, గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్న జాతిహత్య చర్యలకు దిగుతున్న అనాగరికులుగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు. అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు ప్రసంగం తర్వాత ప్రియాంక గాంధీ దీనిపై ఇలా స్పందించారు. పౌరులు, తల్లులు, తండ్రులు, వైద్యులు, నర్సులు, సహాయ కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, సీనియర్ సిటిజన్‌లు, వేలాది మంది అమాయక బాలలు రోజురోజుకూ అంతరించిపోతున్న వారి కోసం ఇకపై మాట్లాడితే సరిపోదని ప్రియాంక ఎక్స్ లో ఓ పోస్టులో అన్నారు.












Click it and Unblock the Notifications