ఇంజెన్‌లో సమస్య..బ్రిడ్జ్‌పై ఆగిపోయిన ట్రైన్..లోకోపైలట్ల సాహసం...
ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు తరుచుగా చూస్తున్నాం. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఓ ట్రైన్ ఇంజెన్‌లో ఏదో సమస్య వచ్చి బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఏం చేయాలని తెలియని పరిస్థితిలో లోకోపైలట్లు ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఓ సాహాసానికి ఒడిగట్టారు. అత్యంత ప్రమాదకర రీతిలో బ్రిడ్జిపై వేలాడుతూ మరీ రైలుకు మరమ్మత్తులు చేయడం ప్రారంభించారు. ఈ సంఘటన రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ ట్రైన్‌లో జరిగింది.
నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ ట్రైన్ ఎప్పటిలాగే ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంది. ఇక, ఈ ట్రైన్ శుక్రవారం నాడు మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఇంజెన్‌లోని అన్‌లోడర్ వాల్వ్‌లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిడంతో ట్రైన్ సడెన్ గా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే, దీనిని రీపేర్ కోసం లోకోఫైలట్లు టెక్నీషియన్లకు ముందుగానే సమచారాన్ని చేరవేసారు. అయితే, రిపేర్ చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత ఆలస్యం అవుతుందని ట్రైన్‌లోని ఇద్దరు లోకోపైలట్లు గుర్తించారు.

వారు వచ్చే లోపు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుడదని వీలైనంత వరకు సమస్యను తామే పరిష్కరించే విధంగా వారు ఆలోచన చేశారు. వెంటనే సాహసంతో కూడిన పనికి పూనుకున్నారు. తమ ప్రాణాలతో అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులకు కాపాడేందుకు రిస్క్ చేయాలనుకున్నారు.
ఇందులో భాగంగానే ఇద్దరు లోకో పైలట్లలో ఒకరు ట్రైన్ కింద దూరి మరమ్మత్తులు చేస్తుండగా, మరొకరు మాత్రం అత్యంత ప్రమాదకర రీతిల బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతూ, నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన చాలామంది నెటిజన్లు ఆ లోకోపైలట్ సాహాసానికి మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications