ఒక్క రోజులో కావు: కెసిఆర్, బాబు భేటీపై గవర్నర్
న్యూఢిల్లీ: ఒక్క రోజులో సమస్యలు పరిష్కారం కావని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మధ్య జరిగిన సమావేశంపై ఆయన ఆ విధంగా అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావుల మధ్య జరిగిన చర్చల వివరాలను రాజ్‌నాథ్‌కు చెప్పినట్లు నరసింహన్ మీడియా సమావేశంలో తెలిపారు.

రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయ్యారు. బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ సమావేశం కానున్నారు. ఒక్క రోజుతో సమస్యలు పరిష్కారం కావని గవర్నర్ అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారని, ఇక అన్నీ సక్రమంగా జరుగుతాయని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని నరసింహన్ తెలిపారు. ఇద్దరు సీఎంలు సమస్యల పరిష్కారం దిశగా ఇప్పుడే ముందడుగు వేశారని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలకు చెందిన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజ్‌నాథ్ సింగ్ గవర్నర్ నరసింహన్‌కు సలహా ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.
త్వరలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా గవర్నర్ విందు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications