కునో అడవిలో మరో 'ఐదు' చిరుత కూనలు.. 'ఆశా'కు మళ్లీ కాన్పు!

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది! ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా నమీబియా నుండి మన దేశానికి వచ్చిన 'ఆశా' అనే చిరుత, తాజాగా ఐదు బుజ్జి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 7, 2026) ఉదయమే ఈ చిన్నారి అతిథులు అడవిలోకి అడుగుపెట్టారు.

ఆశాకు ఇది రెండోసారి ప్రసవం. "నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను" అని చాటిచెప్పినట్టుగా, ఇప్పటికే ఒకసారి పిల్లలను కన్న ఆశా.. ఇప్పుడు మళ్ళీ ఐదు చిరుతపిల్లలను కనడం విశేషం. దీంతో భారత గడ్డపై పుట్టిన చిరుత పిల్లల సంఖ్య ఏకంగా 24కు చేరింది. ప్రస్తుతం మన దేశంలో చిరుతలే లేవు అనుకున్న పరిస్థితి నుంచి, ఇప్పుడు అడవిలో వాటి సందడి పెరుగుతుండటం నిజంగా గర్వించదగ్గ విషయం.

Cheetah

Project Cheetah: ప్రధాని కల నిజమవుతోంది..

ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు కేంద్ర పర్యావరణ, అటవి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. చిరుత పులికి ప్రసవం జరిగిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

"చిరుత పులలను కేవలం తీసుకురావడమే కాదు, వాటిని మన వాతావరణానికి అలవాటు చేసి, సంతానోత్పత్తి జరిగేలా చేయడంలో ఇక్కడి అటవీ శాఖ సిబ్బంది, డాక్టర్లు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆశా వేసిన ఈ అడుగు, భారత్‌ను మళ్ళీ 'చిరుతల దేశం'గా మార్చే దిశలో పెద్ద మలుపు. - కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

మొత్తం 35కు చేరిన సంఖ్య!

ఈ ఐదుగురు కొత్త అతిథుల రాకతో కలిపి, ప్రస్తుతం మన దేశంలో మొత్తం చిరుతల సంఖ్య 35కు చేరుకుంది. అడవిలో ఆశా తన ఐదుగురు పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే వన్యప్రాణి ప్రేమికులకు కన్నుల పండుగగా ఉంది. ఈ బుజ్జి చిరుతలు క్షేమంగా పెరిగి, కునో అడవుల్లో స్పీడుగా పరుగులు తీయాలని అందరం కోరుకుందాం!

Project Cheetah: 20 చిరుతలు..

భారత గడ్డపై పూర్తిగా అంతరించిపోయిన చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే 'ప్రాజెక్ట్ చిరుత'. ప్రపంచంలోనే ఒక ఖండం నుండి మరో ఖండానికి పెద్ద మాంసాహార జంతువులను తరలించి పునరావాసం కల్పించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. దీని కింద నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు.

కేవలం చిరుతల సంఖ్యను పెంచడమే కాకుండా, అడవిలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, గడ్డి భూములను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం భారత వాతావరణానికి అలవాటు పడిన చిరుతలు ఇక్కడే పిల్లలకు జన్మనిస్తుండటం ఈ ప్రాజెక్ట్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+