హిందూ అంటే.., అసద్ తమ్ముడేమన్నారు: వెంకయ్య, బిడ్డతో సభకు పూనమ్

న్యూఢిల్లీ: ఆగ్రాలోని మతమార్పిడుల పైన గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ధీటుగా లోకసభలో సమాధానమిచ్చారు. హిందూస్థాన్ అంటే దేశమంతా ఒక్కటే అని అర్థమని చెప్పారు. మతమార్పిడుల పైన చర్చ సమయంలో ఆయన జవాబిచ్చారు.

దేశంలో మతాలు వేరైనా ప్రజలు ఒక్కటేనని చెప్పారు. ఎవరు కూడా ఉద్రిక్తలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దన్నారు. తనకు ఆరెస్సెస్ నేపథ్యమున్నందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. హిందు అన్న పదాన్ని మనం సృష్టించలేదని, పూర్వం నుండి ఉందని వివరణ ఇచ్చారు. హిందూ పదాన్ని వాడటాన్ని కొందరు తప్పుపడుతున్నారని, హిందుస్థాన్ అంటే అందరు అన్నారు. ఒక పార్టీని నిందిస్తే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.

మతాలు, ధర్మాలు వేరైనా దేశమంతా ఒక్కటేనని గుర్తుంచుకోవాలన్నారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సభలో గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆయన సోదరుడు హైదరాబాదులో ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు నడుచుకోవచ్చునని చెప్పారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యక్తిగతంగా జ్యోతిష్కుడి వద్దకు వెళ్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ఏ అంశం పైన అయినా చర్చకు తాముసిద్ధమని నరేంద్ర మోడీ చాలాసార్లు చెప్పారన్నారు.

వెంకయ్య లోకసభలో చల్లని రాజా ఓ చందమామా... అనే ప్రముఖ తెలుగు పాటను ఉటంకించారు. పాడిందే పాటగా ప్రతిపక్షాలు అరిగిపోయిన రికార్డు వేస్తున్నాయని సభకు చెప్పడంకోసం ఆయన ఈ పాటను ఉటంకించారు. తమ చిన్నతనంలో హెచ్‌ఎంవి రికార్డు ప్లేయర్లు ఉండేవని ఆయన సభకు గుర్తు చేశారు.

రికార్డు అరిగిపోయినపడు చల్లని రాజా ఓ చందమామా... ఓ చందమామా... ఓ చందమామా... అంటూ అక్కడే తిరుగుతూ అదే చరణం పాడుతుంటుందని ఆయన చెబుతున్నపడు సభలో నవ్వులు వెల్లివిరిసాయి. అందరితోపాటు స్పీకర్‌ కూడా నవ్వుతుంటే ఇది నిజం అంటూ వెంకయ్య తమ చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

దేశంలో మతమార్పిడులపై సభలో చర్చ జరగవలసి ఉన్న సమయంలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. వారు చర్చకు నోటీసు ఇస్తారు, చర్చ ప్రారంభమయ్యే సమయానికి గొడవ చేస్తారు, చర్చలో పాల్గొనరు, చివరకు వాకౌట్‌ చేస్తారు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వారు ప్రజాస్వామ్య విలువలను పాటించరు, పాటించేవారిని గౌరవించరని ఆయన మండిపడ్డారు.

వెంకయ్య

వెంకయ్య

ఆగ్రాలోని మతమార్పిడుల పైన గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ధీటుగా లోకసభలో సమాధానమిచ్చారు.

ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్

గురువారం నాడు లోకసభలో మాట్లాడుతున్న సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యుడు ములాయం సింగ్ యాదవ్.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

శీతాకాల పార్లమెటు సమావేశాలు సాగుతున్నాయి. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు వచ్చిన దృశ్యం.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

శీతాకాల పార్లమెటు సమావేశాలు సాగుతున్నాయి. గురువారం నాడు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు వచ్చిన దృశ్యం.

పూనమ్ మహాజన్

పూనమ్ మహాజన్

శీతాకాల పార్లమెటు సమావేశాలు సాగుతున్నాయి. గురువారం నాడు బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ పార్లమెంటుకు వచ్చిన దృశ్యం. తన వెంట తన కూతురును తీసుకొని వచ్చారు.

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

శీతాకాల పార్లమెటు సమావేశాలు సాగుతున్నాయి. గురువారం నాడు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పార్లమెంటుకు వచ్చిన దృశ్యం.

రాజ్యసభ

రాజ్యసభ

ఆగ్రాలోని మతమార్పిడుల పైన గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ధీటుగా లోకసభలో సమాధానమిచ్చారు.

పూనమ్ మహాజన్

పూనమ్ మహాజన్

శీతాకాల పార్లమెటు సమావేశాలు సాగుతున్నాయి. గురువారం నాడు బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ లోకసభలో మాట్లాడుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+