పబ్జీలో మునిగిపోయి రైలు గుద్ది ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు

Recommended Video

    #Pubg : పబ్జీలో మునిగిపోయి.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు..!! | Oneindia Telugu

    పబ్జీ ఆటల్లో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక చోట పబ్జీ అంటే వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పబ్జీని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఈ ఆట వల్ల యువత భవిష్యత్తును సైతం నాశనం చేసుకుంటున్నారని, ఈ ఆట కోసం ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదే క్రమంలో మరో ఇద్దరు యువకులు పబ్జీ ఆట ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
    టెన్‌సెంట్ కంపెనీకి చెందిన ప్రముఖ ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ 'పబ్జీ' కి రోజురోజుకీ యువత బానిసలుగా మారుతున్నారు. ఈ పబ్జీ గేమ్ వల్ల ఎందరో యువకులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతుంది. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో నాగేశ్‌ గోరే(22), స్వప్నిల్ అన్నపూర్నే (24) అనే ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు.

    PUBG effect ..Two teenagers were died by hitting train

    ఇద్దరు యువకులు ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొట్టింది.
    శనివారం సాయంత్రం సమయంలో ఖటకాళీ బైపాస్‌ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరకు వీరిద్దరూ బైక్‌పై వచ్చారు. ట్రాక్‌ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని 'పబ్‌జీ' ఆడతుండగా వారిని రైలు గుద్దడంతో చనిపోయారు. ఆటలో మునిగి పోయిన ఇద్దరూ అజ్మీర్‌-హైదరాబాద్‌ రైలు వస్తుండగా గమనించలేదు. రైలు డ్రైవర్‌ హార్న్‌ కొట్టినా వినిపించుకోలేదు. దూసుకొచ్చిన రైలు ఇద్దరినీ ఢీ కొట్టగా వారు అక్కడికక్కడే చనిపోయారు. పబ్జీ ఆటలో నిమగ్నమై ఇద్దరు యువకులు రైలు వచ్చేది గమనించకుండా రైలు గుద్దడంతో దుర్మరణం చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+