Karnataka Elections 2023: కర్ణాటక ప్రజలు ఎటు మొగ్గు చూపుతున్నారు.. !

కర్ణాటక(Karnataka elections 2023)లో ఓటర్ల పల్స్‌ను అర్థం చేసుకునేందుకు పబ్లిక్‌వైబ్‌, వన్‌ఇండియా సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. శనివారం వన్ఇండియా వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. రానున్న ఎన్నికల్లో మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, 2 మంది ఇతరులు ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో- 224 మంది బీజేపీ, 223 మంది కాంగ్రెస్ (మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీకి మద్దతు), 207 జేడీ(ఎస్), 209 ఆప్, 133 బీఎస్పీ, 4 సీపీఐ(ఎం), 8 జేడీ(యూ), 2 ఎన్పీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు .

Karnataka opinion poll

685 మంది రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు (RUPP) చెందిన వారు కాగా, 918 మంది స్వతంత్రులు ఉన్నారు. 16 నియోజకవర్గాల్లో 15 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ సెగ్మెంట్లలో రెండు బ్యాలెట్ యూనిట్ (BU) ఉపయోగించనున్నారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఆధిక్యత ఉందని ఏడు సర్వేల్లో రెండు సర్వేలు ప్రకటించాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మిగతా సర్వేలు అంచనా వేస్తున్నాయి.

టీవీ9, సీ-వోటర్ సర్వేలు కాంగ్రెస్‌కు 106-116 సీట్లు వస్తాయని, బీజేపీ 79-89 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. జేడీఎస్ 24-34 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కర్నాటకలోని పబ్లిక్ టీవీ మూడ్ ప్రకారం, కాంగ్రెస్ 98-108 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 85-95 సీట్లు గెలుస్తుందని, జేడీఎస్ 28-33 సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+