రణరంగమైన ఎంసీడీ ప్యానెల్ ఎన్నిక: ఆప్, బీజేపీ సభ్యుల ఘర్షణ, తన్నుకున్నరు!
ఢిల్లీ మున్సిపల్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులకు జరిగిన ఎన్నికలో మేయర్ ఒక ఓటు చెల్లదని ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: కీలకమైన మున్సిపల్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులకు జరిగిన ఎన్నికలో మేయర్ ఒక ఓటు చెల్లదని ప్రకటించడంతో ఢిల్లీ సివిక్ బాడీ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. తన్నుకున్నారు.
ఈ గొడవలో మేయర్ షెల్లీ ఒబెరాయ్‌ను నెట్టారని, మహిళా కౌన్సిలర్లు కూడా కొట్టారని ఆరోపించారు. అరుపులు కేకలు, గందరగోళం మధ్య, ఓ ఆప్ కౌన్సిలర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడ్ని మేయర్ బెంచ్‌పై పడుకోబెట్టారు. ఇరు పక్షాలు ఒకరిపై పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్నికలో ఆప్ మేయర్ నిబంధనలు పాటించడం లేదన్నారు బీజేపీ కౌన్సిర్లు ఆరోపించారు.

అంతకుముందు రోజు, 250 మంది కౌన్సిలర్లలో 242 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ ముగిసింది. కాగా, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ స్టాండింగ్ కమిటీ.
మేయర్.. ఒక్క ఓటు చెల్లదని చెప్పడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రచ్చ మొదలైంది. చెల్లని ఓటు లేకుండానే ఫలితాన్ని ప్రకటిస్తామని మేయర్ పట్టుబట్టారు. మేయర్ ఫలితాలు ప్రకటిస్తే కోర్టుకు వెళ్తామని బీజేపీ పేర్కొంది.
#WATCH | Ruckus breaks out at Delhi Civic Centre once again as AAP and BJP Councillors jostle, manhandle and rain blows on each other. This is the third day of commotions in the House. pic.twitter.com/Sfjz0osOSk
— ANI (@ANI) February 24, 2023
మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యుల మొదటి జాబితాపై సంతకం చేయడానికి నిరాకరించారు. ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేశారు. అయితే రీకౌంటింగ్‌పై మేయర్ నిర్ణయంపై సంతకం చేసేందుకు కార్పొరేషన్ కార్యదర్శి నిరాకరించారు.












Click it and Unblock the Notifications