ప్రాణాలు తీసిన కారు: 5 గంటల పాటు కారులోనే బాలుడు, మృత్యువాత

పూణె: స్నేహితులతో ఆడుకొంటూ పార్క్ చేసిన కారులో కూర్చొన్న సమయంలో ఆ కారు లాక్ కావడంతో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయిన ఘటన మహరాష్ట్రలో మంగళవారం నాడు చోటు చేసుకొంది.

మహరాష్ట్రలోని పూణెలో కరణ్‌పాండే అనే ఐదేళ్ళ బాలుడు తన స్నేహితులతో మంగళవారం నాడు ఆడుకొంటున్నాడు. అయితే ఆ సమయంలో ఎండకు తాళలేక అక్కడే పార్క్ చేసిన కారులో కూర్చుండిపోయాడు. అయితే ఆ కారు పొరపాటున కారు లాక్ అయిపోయింది.

Pune: 5-year-old boy trapped in abandoned car dies of heat

ఐదు గంటల పాటు కారులోనే ఆ బాలుడు అలానే కూర్చుండిపోయాడు. కారు లాక్ కావడంతో ఊపిరి ఆడక ఆ బాలుడు కారులోనే ప్రాణాలు విడిచాడు. అయితే కారులో కరణ్ కూర్చున్న విషయాన్ని కూడ అతడి స్నేహితులు గమనించలేదు.

అయితే ఆడుకొనేందుకు వెళ్లిన కరణ్ ఐదు గంటలు దాటినా కానీ ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు. అయితే కారులో కరణ్ ఉన్న విషయాన్ని ఎట్టకేలకు గుర్తించారు. కరణ్‌ను తల్లిదండ్రులు చూసే సమయానికి అతడు చనిపోయాడు.అయితే ఈ కారు ఎవరిది , ఎంతకాలంగా ఈ ప్రాంతంలో పార్క్ చేశారు. ఎందకు పార్క్ చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+