Puneeth Rajkumar: పునీత్ ను చూసి విలపించిన చిరంజీవి, నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి !

బెంగళూరు/ హైదరాబాద్: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీనీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను గట్టిగా పట్టుకున్న చిరంజీవి, వెంకటేష్ బోరున విలపించారు. రాజ్ కుమార్ కుటుంబానికి, మెగాస్టార్ కుటుంబానికి సుమారు 40 ఏళ్ల నుంచి చక్కటి అనుబంధం ఉంది. సినిమా నటులుగానే కాకుండా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఫ్యామీలో ఫ్రెండ్స్. చిరంజీవి బెంగళూరు ఎప్పుడు వచ్చినా దాదాపుగా శివరాజ్ కుమార్ కచ్చితంగా ఆయన్ను కలుస్తారు. శివరాజ్ కుమార్ మొదటిసారి ఆయన తండ్రి రాజ్ కుమార్ జీవిత చరిత్ర గురించి నానిరువుది నినగాగి అనే టీవీ షో రూపోందించారు. ఆ మొదటి ఎపిసోడ్ కు 2011లో మెగాస్టార్ చీఫ్ గెస్టుగా హాజరై శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ను ఆశీర్వదించారు.

కన్నీరు పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి

శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో ప్రాణాలు వదలిలిన విషయం తెలిసింది. కన్నడ, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహం చూసిన వెంటనే చిరంజీవి కన్నీరు ఆపుకోలేకపోయారు. కొన్ని నిమిషాల పాటు చిరంజీవి అక్కడే మౌనంగా ఉండిపోయారు.

ఒకేసారి వచ్చిన తెలుగు హీరోలు

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కననీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను గట్టిగా పట్టుకున్న చిరంజీవి, వెంకటేష్ బోరున విలపించారు.

నా జీవితంలో మరిపోలేని వ్యక్తి పునీత్ రాజ్ కుమార్, చిరంజీవి

పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన తరువాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. గత 40 ఏళ్ల నుంచి రాజ్ కుమార్ కుటుంబానికి తో తనకు చక్కటి అనుబంధం ఉందని చిరంజీవి అన్నారు. సినిమా నటులుగానే కాకుండా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, మేము ఫ్యామీలో ఫ్రెండ్స్ అని, నేను బెంగళూరు ఎప్పుడు వచ్చినా దాదాపుగా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కచ్చితంగా కలుస్తానని చిరంజీవి అన్నారు. వినయం, విధేయత ఉన్న పునీత్ రాజ్ కుమార్ లేని లోటు ఆయన కుటుంబ సభ్యులను దేవుడు తీర్చాలని కోరుకుంటానని, పునీత్ రాజ్ కుమార్ ను నా జీవితంలో నేను మరిచిపోలేనని మెగాస్టార్ చిరంజవి అన్నారు.

రాజ్ టీవీ షోకి ఆ రోజు చిరంజీవి చీఫ్ గెస్ట్

రాజ్ టీవీ షోకి ఆ రోజు చిరంజీవి చీఫ్ గెస్ట్

శివరాజ్ కుమార్ మొదటిసారి ఆయన తండ్రి రాజ్ కుమార్ జీవిత చరిత్ర గురించి నానిరువుది నినగాగి అనే టీవీ షో రూపోందించారు. ఆ మొదటి ఎపిసోడ్ కు 2011లో బెంగళూరు శివార్లలోని బిడిదిలో ఉన్న జీ స్టూడియోలో జరిగిన టీవీ షో షూటింగ్ కు మెగాస్టార్ చీఫ్ గెస్టుగా హాజరై శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ను ఆశీర్వదించారు. ఆ ఎపిసోడ్ లో పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటకలోని చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో చిరంజీవి, వెంకటేష్, సురేష్ బాబు, శ్రీకాంత్, ఆలీ తదితరులు ఒకేసారి బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలోకి చేరుకోవడంతో అభిమానులు వారిని చూసేదానికి పోటెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+