పంజాబ్ లో కొత్త పొత్తులు - లెక్కలు : ఎవరితో ఎవరు కలుస్తారు : ఎవరి ఓట్లు చీలుస్తారు..!!

మరో మూడు - నాలుగు నెలల్లో పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఉత్తరప్రదేశ్ తో పాటుగా పంజాబ్ పైన రాజకీయ ఆసక్తి నెలకొని ఉంది. దీనికి కారణం అక్కడ వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలే. పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి తెరలేస్తోంది. కాంగ్రెస్‌, అకాలీదళ్‌, ఆప్‌, బాప్‌లతో పాటు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఏర్పాటుచేసే కొత్త పార్టీ భాజపాతో కలిసి పోటీ చేసే అవకాశం ఉండటంతో ప్రధానంగా అయిదు పక్షాలు పోటీకి దిగే అవకాశం కనిపిస్తోంది.

చన్నీ పైనే కాంగ్రెస్ ఆశలు

చన్నీ పైనే కాంగ్రెస్ ఆశలు

కాంగ్రెస్ మీద రగిలిపోతున్న కెప్టెన్ అమరీందర్ అకాలీదళ్‌లోని ధిండ్సా, బ్రహ్మపుర లాంటి చీలికవర్గాలతోనూ పొత్తులు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, అటు నుంచి కాంగ్రెస్ సైతం వ్యూహాత్మకంగానే పావులు కదిపింది. వచ్చే ఎన్నికలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలోని దళిత ఓట్లపైన ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ దళిత నాయకుడైన చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. పంజాబ్‌ జనాభాలో 32శాతం దళితులే. ఇప్పటి వరకూ అక్కడ ఒక్కసారీ దళిత నేత సీఎం పీఠంపై కూర్చోలేకపోయారు.

దళిత ముఖ్యమంత్రి హామీతో ముందుకు

దళిత ముఖ్యమంత్రి హామీతో ముందుకు

రాష్ట్ర జనాభాలో 20 శాతమే ఉన్న జాట్‌ సిక్కుల నుంచి 13 మంది ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాన్ని ఏలారు. ఇప్పుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి చన్నీ రూపంలో ఒక దళిత ముఖ్యమంత్రి వచ్చారు. ఎన్నికలు వచ్చేలోపు తన మార్కు పాలనను అందించి, దళిత ఓట్లను సాధించటం కష్టం కాదనేది ఆ పార్టీ అంచనా. అదే సమయంలో దళిత ముఖ్యమంత్రి కొనసాగుతారంటూ ఎన్నికల వేళ ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పీసీసీ చీఫ్ సిద్దూ లాంటి వారు సీఎం పదవి కోసం పోటీ పడటం..కొత్త చికాకులు తెచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు.

అకాలీదళ్.. బీఎస్పీ పొత్తు ప్రభావం

అకాలీదళ్.. బీఎస్పీ పొత్తు ప్రభావం

2017 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాలు గణనీయ సంఖ్యలో కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. దళిత సంప్రదాయ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌ వెంటే ఉంటుందని, దానికితోడు అకాలీదళ్‌, భాజపా వేరుపడినందువల్ల మరోసారి తమకే అవకాశం దక్కవచ్చని కాంగ్రెస్‌ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అకాళీదల్ కమలానికి కటీఫ్ చెప్పి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ బీఎస్పీకి ప్రత్యక్షంగా బలం లేకపోయినా.. దళితుల్లోని రామ్‌దాసియా వర్గం నుంచి కొంత ఆదరణ లభించే అవకాశం ఉంది.

కీలకంగా మారుతున్న ఆప్

కీలకంగా మారుతున్న ఆప్


మొత్తం జనాభాలో 10శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వర్గానికి చెందిన చన్నీయే ముఖ్యమంత్రిగా ఉండటంతో అకాలీదళ్‌- బీఎస్పీ కూటమి ఆశలకు గండికొట్టే అవకాశాలూ ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 017 ఎన్నికల్లో గట్టిపోటీ ఇస్తుందనుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ 20 స్థానాలతోనే సరిపెట్టుకున్నా, ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం నిలిచింది. అందులో 18 స్థానాలు మాల్వా ప్రాంతంలోనే దక్కించుకుంది. అయితే, ఇప్పుడు కేజ్రీవాల్ ఇతరుల కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహిళలకు వెయ్యి రూపాయాల ఆర్దిక తోడ్పాటు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అనూహ్యంగా ఆప్ పంజాబ్ లో పంజుకొని ప్రధాన పార్టీలకు ప్రత్యర్దిగా మారుతోంది.

బీజేపీ సొంతంగానా...కెప్టెన్ తో కలిసా

బీజేపీ సొంతంగానా...కెప్టెన్ తో కలిసా


ఇంకోవైపు రైతు సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతామని చెబుతున్న భారతీయ ఆర్థిక పార్టీ (బాప్‌) ఇప్పటికే భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అండదండలు పొందే ప్రయత్నం చేస్తోంది. అదే జరిగితే ఈ కూటమి బలమైన పక్షంగా మారనుంది. బీజేపీతో పాటుగా అకాళీదళ్ చీలిక వర్గాలతో కలిసి పోటీకి సిద్దమవుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏ మేర ప్రభావం చూపుతారనేది మరో సస్పెన్స్ గా మారింది. దీంతో..ఎన్నికల్లోగా ఇంకా పంజాబ్ లో రాజకీయాలు ఎటువంటి టర్న్ తీసుకుంటాయి.. ఎవరికి అనుకూలంగా మారుతాయి..ఎవరిని దెబ్బ తీస్తాయనే అంశాల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+