మోదీ టూర్‌లో భద్రతా వైఫల్యం లేదు.. ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణం వేరే.. పంజాబ్ సీఎం చన్నీ చుర‌క‌లు

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణజీత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కావాలనే తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. చివరి నిమిషంలో ప్రధాని మోదీ రోడ్డుమార్గంలో వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల నిరసనలు తెలపడం దురదృష్ణకరం అన్నారు. మోదీ పర్యటన అర్థాంతరంగా వాయిదా పడడంపై విచారం వ్యక్తం చేశారు చన్నీ.

Recommended Video

    PM Modi Security Lapse: BJP VS Congress | Article 356 | Oneindia Telugu
    భద్రతా పరమైన సమస్యలులేవు.. ఆస‌లు కార‌ణం వేరే..

    భద్రతా పరమైన సమస్యలులేవు.. ఆస‌లు కార‌ణం వేరే..

    ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం భఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు హెలికాప్టర్‌లో రావాల్సి ఉందని సీఎం చరణజీత్ సింగ్ చన్నీ తెలిపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు. ఈ కారణంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు. మోదీకి పర్యటనకు ఎలాంటి భద్రత వైఫల్యం లేదన్నారు. రాజకీయ కారణాలతో పంజాబ్ ప్రభుత్వంపై నింధలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభకు వారు ఉహించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంలో మోదీ ర్యాలీ రద్దుకు కారణమని చన్నీ ఆరోపించారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తలేదన్నారు.

    రైతులు శాంతియుతంగా ఆందోళన

    రైతులు శాంతియుతంగా ఆందోళన

    మోదీ ప్ర‌భుత్వం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గ‌త‌ ఏడాది కాలంగా రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారని చన్నీ పేర్కొన్నారు. వారిపై తమ ప్రభుత్వం ఎలాంటి లాఠీఛార్జీ కూడా చేయబోదంటూ రైతుల నిరసనను ఆయన సమర్థించారు. నిన్న ( మంగళవారం) రాత్రి రైతులతో మాట్లాడమని .. అనంతరం వారు తమ ఆందోళనను ముగించారని చెప్పారు. అయితే ఈరోజు (బుధ‌వారం ) కొంతమంది ఆందోళనకారులు ఫీరోజ్ పూర్‌లో గుమిగూడారని పేర్కొన్నారు.

    ప్ర‌ధానికి స్వాగతం ప‌లికేందుకు నేను వెళ్లాల్సింది .. కానీ..

    ప్ర‌ధానికి స్వాగతం ప‌లికేందుకు నేను వెళ్లాల్సింది .. కానీ..


    ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎంగా తాను వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన ఛీప్ సెక్రటరీకి కరోనా సోకడంతో తాను వెళ్లలేదని చరణ్ జిత్ సింగ్ చన్నీ వివరణ ఇచ్చారు. అందుకే ప్రధానిని కలుసుకునేందుకు హోంమంత్రిని పంపామని తెలిపారు. రైతులను శాంతింపజేసేందుకు తాము ప్రయత్నించామని తెలిపారు. రైతుల నిరసన కారణంతో ప్రధాని మోదీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకోని వెళ్లడం దురదృష్టకరమే అని పేర్కొన్నారు.

    బీజేపీ సభకు జనం నిల్.. అందుకే అలా..

    ప్రధాని మోదీ పంజాబ్ నుంచి వెనుదిగడానికి అసలు కారణం వేరని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా. బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు అనుకున్న స్థాయిలో జనం రాకపోవడంతోనే ఆసభను రద్దు చేసుకున్నారంటూ ఓ వీడియోను తన ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసలు విషయాలను పక్కన పెట్టి పంజాబ్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటనకు 10వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు వచ్చే అన్ని బస్సులకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. వాస్తవానికి చివరి నిమిషంలో మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    మోదీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

    మోదీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు

    పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఈరోజు (బుధవారం) ఫిరోజ్ పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం భఠిండా నుంచి హెలికాప్టర్ అక్కడకి వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించికపోవడంతో చివరి నిమిషంలో సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో ప్రధాని మోదీకి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. హుస్సేనివాలాలోని ఫ్లైఒవర్ వద్దకు ప్రధాని కాన్వాయ్ రాగానే కొందమంది ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే కాన్వాయ్ నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+