బ్యాంకు రుణాల ఎగవేత: సీఎం అమరీందర్ సింగ్ అల్లుడిపై సిబిఐ కేసు

చంఢీగడ్: సిబిఐ అధికారులు సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలోని కొందరు కీలకమైన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఫ్యాక్టరీ డీజీఎం గురుపాల్ సింగ్‌తో సహ పలువురిపై కేసులు నమోదు చేశారు. గురుపాల్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలో డీజీఎంగా పనిచేస్తున్న గురుపాల్ సింగ్ డీజీఎంగా ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీపై బ్యాంకు రుణాన్ని తీసుకొని ఎగవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 200 కోట్లను బ్యాంకు రుణాన్ని ఎగవేశారనే ఆరోపణలతో సిబిఐ కేసు దాఖలు చేసింది

Punjab CM’s son-in-law among 13 booked for bank fraud case against Simbhaoli Sugars Ltd

రెండు బ్యాంకు రుణాలను ఈ ఫ్యాక్టరీ తీసుకొందని సిబిఐ దాఖలు చేసిన ఎప్‌ఐఆర్‌లో పేర్కొంది. ఓరియంటల్ బ్యాంక్ నుండి రూ.97.85 కోట్లు, కార్పోరేట్ బ్యాంక్ నుండి రూ.110 కోట్లు రుణాలను తీసుకొని ఎగవేశారని పేర్కొంది.

ఈ విషయమై బ్యాంకు అధికారులు 2017 నవంబర్‌లో సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2018 ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు అధికారులు. గురుపాల్ తో పాటు మరో 12 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీ చైర్మెన్ గుర్మిత్ సింగ్ సహ పలువురిపై కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+