Amritpal singh: పోలీసులు వెంటాడి పట్టుకున్నారా..తానే లొంగిపోయాడా-ఏం జరిగింది.?
అమృత్‌సర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ అరెస్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా..అమృత్‌పాల్ సొంతంగా పోలీసులకు లొంగిపోయాడంటూ అకాలీదళ్ వాదిస్తోంది.
పంజాబ్ నుంచి ఖలిస్తాన్ ప్రత్యేక రాష్టంగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న బృందానికి అమృత్‌పాల్ సింగ్ నేతృత్వం వహిస్తున్నాడు.అమృత్ పాల్ పై జాతీయ భద్రతా చట్టం కింద 16 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసుల కళ్లుగప్పి అమృత్ పాల్ సింగ్ పంజాబ్‌లోనే నెల రోజులుగా తప్పించుకు తిరుగుతన్నాడు. మారువేషాల్లో వెళుతూ, వివిధ వాహనాలలో తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు.

అయితే అమృత్‌పాల్ సింగ్‌కు సహాయం చేసిన 100కు మందికి పైగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు.కానీ అమృత్ పాల్ సింగ్ జాడను మాత్రం కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారు. చివరకు ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు బింద్రన్ వాలే జన్మస్థలంలో అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే అమృత్ పాల్ అరెస్టు పై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. పోలీసులకు తాను ఎక్కడున్నాడో సమాచారం ఇచ్చి తనే లొంగిపోయాడనే చర్చ జరుగుతుండగా.. పోలీసులు మాత్రం రోట్ గ్రామంలో అమృత్‌పాల్‌ను చుట్టుముట్టి ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా అరెస్టు చేశామంటూ గర్వంగా చెబుతున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే వాదన వినిపిస్తోంది.

కానీ శిరోమణి అకాలీదళ్ పార్టీ మాత్ర భిన్న స్వరం వినిపిస్తోంది.తాను లొంగిపోవాలని భావిస్తున్నట్లు అమృత్‌పాల్ సింగ్ శిరోమణి అకాలీదల్ పార్టీకి తెలపగా ఇదే విషయం తాము పోలీసులకు చెప్పినట్లు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అమృత్‌పాల్ సింగ్ ఉంటున్న గ్రామాన్ని చుట్టుముట్టారు. అయితే ఇక్కడ అమృత్‌పాల్ సింగ్ తనకు తానుగా లొంగిపోయాడు కానీ, పోలీసుల గొప్పతనం ఏమీ లేదని పేర్కొంది.పోలీసులకు శిరోమణి అకాలీదళ్ పార్టీ సహాయం చేసిందని స్పష్టం చేసింది. దీంతో పంజాబ్ రాజకీయాల్లో ఇదో పెద్ద చర్చకు దారితీస్తోంది.












Click it and Unblock the Notifications