పంజాబ్‌లో ఆప్ డర్టీ ట్రిక్స్.. కేజ్రీవాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయండి : ఈసీకి సిద్ధూ లేఖ
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ ఆప్ అన్న విధంగా ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటలు తూటాలతో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ కాక పుట్టిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పంజాబ్ ప్రజలును మోసం చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ఒక స్కాంస్టర్ అంటూ దుయ్యబట్టారు.

కేజ్రీవాల్ తీరుపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ చిటపటలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీరుపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆప్ తరుపున పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలంటూ ఇటీవల నిర్వహించిన ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్ సర్వేను సిద్దూ తప్పపట్టారు. ఇది ఆచరణీమైనది కాదని విమర్శలు గుప్పించారు. "జనాతా చునేగీ అప్నా సీఎం" పేరుతో పంజాబ్‌లో నకిలీ ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెర తీసిందని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రిని నేరుగా ఎన్నుకునేందుకు టెలిఫోన్ కాల్స్‌ను నిర్వహిస్తుందని.. దీనిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసిందన్నారు.

కేజ్రీవాల్ డర్టీ ట్రిక్స్..
తన డర్టీ ట్రిక్స్ తో పంజాబ్ ప్రజలను మోసం చేయడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని సిద్ధూ దుయ్యబట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక స్కాంస్టర్ అని మండిపడ్డారు. ఆప్ నకిలీ వార్తలను సృష్టించి ప్రజల్లో విసృతంగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఈమేరకు ఈసీకి లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రైవేట్ నంబర్‌కు ఇన్ని మేసేజ్‌ఎలా ?
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి కోసం అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రైవేటు నంబర్ ప్రారంభించారని సిద్ధూ తెలిపారు. దీని ద్వారా 21 లక్షల మేసేజ్‌లు వచ్చినట్లు క్రేజీవాల్ ఆవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. ఒక ప్రైవేట్ నంబర్‌కు సాధారణంగా ఒకరోజులో 5వేలకు మించి మేసేజ్ కానీ ఫోన్ కాల్స్ కానీ రావన్నారు. అసలు విషయం దాచి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపు కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ప్రచారం చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారని సిద్ధూ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications