వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ పోరు: రెబల్‌గా సీఎం సోదరుడు, టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి

|
Google Oneindia TeluguNews

పంజాబ్ పోరుపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. గెలుపు గుర్రాలను పార్టీలు అన్వేషిస్తున్నాయి. టికెట్ దక్కకుంటే మిగతా పార్టీల వైపు వెళుతున్నారు. పంజాబ్‌ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం రచ్చకు దారితీసింది. మొగ నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాల్వికాకు టికెట్ దక్కగా.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్జోత్ కమాల్ బీజేపీలో చేరి అదే స్థానంలో పోటీకి సిద్ధమయ్యారు. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీకి షాకిస్తూ ఆయన సోదరుడు మనోహర్ సింగ్ సైతం కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగుతున్నారు.

రెబల్స్ బెడద

రెబల్స్ బెడద


బీజేపీ, అకాలీ దళ్ నుంచి పెద్దగా పోటీ ఉండదని, ఆమ్ ఆద్మీ పార్టీని కాచుకుంటే వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఉవ్విళ్లూరుతోన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రెబల్స్ గుబులు పట్టుకుంది. సీఎం సోదరుడే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తుండటం ఆ పార్టీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా‌ ఆ పార్టీ రాష్ట్ర యూనిట్‌లో అసంతృప్తులకు తావిచ్చింది. మాన్సా, మొగా, మలౌట్, బస్సి పఠానా నియోజవర్గాల టిక్కెట్లు ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది.

ఇండిపెండెంట్‌గా బరిలోకి..

ఇండిపెండెంట్‌గా బరిలోకి..

సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు సైతం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న సీఎం చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, బస్సీ పఠానా నియోజకవర్గం టిక్కెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. సోదరుడిని బుజ్జగించి పోటీ నుంచి విరమింపజేసేలా సీఎం చన్నీ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.

ఫస్ట్ లిస్ట్ ఇదే

ఫస్ట్ లిస్ట్ ఇదే


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం రోజున విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుండగా, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చంకౌర్ సాహిబ్ నుంచి పోటీకి దిగనున్నారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌కు మోగా నియోజకవర్గం టెక్కెట్ కేటాయించారు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.

English summary
Punjab Congress has found its biggest rebellion in Chief Minister Charanjit Singh Channi’s younger brother Dr Manohar Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X