సిద్ధూకు పాకిస్థాన్‌తో సంబంధాలు.. అమ‌రీంద‌ర్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు తమ అస్త్రాలను వదులుతున్నాయి. ఎన్నికల సమరంలో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు తమ వాగ్ధాటినీ పెంచుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. ప్రజాక్షేత్రంలో అధికారం మాదేనంటూ ఎవరికి వారూ ధీమా వ్యక్తం చేస్తూ తమ వ్యూహాలను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు.

పాకిస్థాన్‌తో సిద్ధూకు సత్సంబంధాలు

కాంగ్రెస్ పార్టీ వీడి సొంత కుంపటి పెట్టుకున్న పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై తీవ్ర స్థాయిలో ఆరోపణస్త్రాలు సంధించారు. మన దేశానికి పక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తో సిద్ధూకు సత్సంబంధాలు ఉన్నాయంటూ బాంబ్ పేల్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు మేసేజ్ పంపారని పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ మంత్రివర్గంలోకి తీసుకొమ్మని దాని సందేశమని అమరీందర్ సింగ్ చెప్పుకొచ్చారు.

సిద్ధూను మంత్రి వర్గంలోకి తీసుకోవాల‌ని ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్

సిద్ధూను మంత్రి వర్గంలోకి తీసుకోవాల‌ని ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్


సిద్ధూ తనకు పాత మిత్రుడని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నట్లు అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అంతే కాకుండా తనకు ఒక రిక్వెస్ట్ కూడా పంపినట్లు చెప్పారు. సిద్ధూను మంత్రి వర్గంలోకి తీసుకుంటే తాను ఎంతో సంతోషిస్తానని అన్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ సిద్ధూ సరిగా పనిచేయపోతే అతన్ని మంత్రి వర్గం నుంచి తొలిచించవచ్చని ఇమ్రాన్ ఖాన్ తనకు సలహా కూడా ఇచ్చారని అమరీందర్ సింగ్ చెప్పారు.

 బీజేపీతో కూట‌మి ..

బీజేపీతో కూట‌మి ..

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అమరీందర్ సింగ్ .. నవ‌జ్యోత్‌సింగ్ సిద్ధూతో వివాదం వల్లే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. బీజేపీ కూటమితో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ 65, పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37, సంయుక్త అకాలీదళ్ మరో 17 స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.

పాటియాలా నుంచి అమ‌రీంద‌ర్ సింగ్ బ‌రిలోకి..

పాటియాలా నుంచి అమ‌రీంద‌ర్ సింగ్ బ‌రిలోకి..

మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సిట్టింగ్ స్థానమైన పాటియాలా నుంచి పోటీ చేస్తున్నారు.. ఈ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాటియాలా అర్బన్ నుంచే పోటీ చేస్తానని అమరీందర్ సింగ్ ప్రకటించారు. తన ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదన్నారు. తన గత ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విజయాలపై ప్ర‌జ‌లు త‌న‌కు ఓట్లు వేస్తార‌ని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+