విశ్వాస తీర్మానానికి ఒకరోజు ముందే ఆప్‌కి షాక్: అసెంబ్లీ సమావేశాల అనుమతి రద్దు

ఛండీగఢ్: విశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం ఉపసంహరించుకున్నారు. విశ్వాస తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని పిలిచింది.

'నిర్దిష్ట నియమాలు లేకపోవడం' కారణంగా గవర్నర్ ఆర్డర్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.

Punjab Governor withdraws order of Assembly session called by AAP govt to pass confidence motion.

'కేబినెట్ పిలిచిన సెషన్‌ను గవర్నర్‌ ఎలా తిరస్కరిస్తారు.. ఇక ప్రజాస్వామ్యం ముగిసింది.. రెండు రోజుల క్రితం గవర్నర్‌ సెషన్‌కు అనుమతి ఇచ్చారు. ఆపరేషన్‌ లోటస్‌ ఫెయిల్‌ అయి నంబర్‌ రాకపోవడంతో పైనుంచి విత్‌డ్రా చేయమని కాల్‌ వచ్చింది. నేడు దేశంలో ఒకవైపు రాజ్యాంగం, మరోవైపు ఆపరేషన్ కమలం ఉంది' అని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంగళవారం, పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తోందని అధికార ఆప్ ఆరోపించిన కొద్ది రోజుల తరువాత.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతంలో ప్రకటించారు.

ఆరు నెలల ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కనీసం 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఒక్కొక్కరికి రూ.25 కోట్ల ఆఫర్‌తో సంప్రదించిందని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఆరోపించింది.

కొన్ని రోజుల క్రితం, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. బీజేపీ 'ఆపరేషన్ లోటస్'లో భాగంగా, రాష్ట్రంలోని కొంతమంది ఆప్ శాసనసభ్యులను కాషాయ శిబిరానికి చెందిన వ్యక్తులు సంప్రదింపులు జరిపారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+