Viral Video: అరేయ్ చిన్న పిల్లరా పాపంరా.. స్కూల్ లో బాలికపై ప్యూన్ దారుణం
ఇటీవలి కాలంలో రోజురోజుకూ సమాజంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అని తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మరికొంతమంది మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛ కారణంతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా పంజాబ్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పనిచేసే ఓ ప్యూన్ అదే పాఠశాలకు చెందిన 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 75 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తరగతి గదిలో ఉన్న బాలికను తన ఆఫీస్ రూమ్ నుంచి బుక్ తీసుకురావాలని టీచర్ చెప్పింది. అయితే బుక్ కోసం ఆఫీస్ కు చిన్నారి వెళ్లగా అదే సమయంలో అక్కడకు వచ్చిన స్కూల్ ప్యూన్.. బాలికను దగ్గరకు లాక్కుని బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడబోయాడు. చిన్నారికి ముద్దు పెట్టడంతో పాటు.. బలవంతంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో కూడా తీశాడు ఆ కామాంధుడు.
A 16-year-old student was molested by a peon inside a private school in Ludhiana. The incident was caught on CCTV, showing the accused grabbing the teen from behind and forcibly kissing her.According to the complaint filed with the police, the student was sent to the office by her teacher to fetch a book.While she was searching for it, the accused, identified as Kipyun Prince, entered the room and initially helped her look for the book.#Ludhiana #SchoolSafety #ChildSafety #Punjab #CCTVFootage #CrimeNews
— IndiaToday (@IndiaToday) October 19, 2026
ఇక ప్యూన్ ప్రవర్తనకు భయపడిపోయిన బాలిక వెంటనే రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనపై తన తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రవి కుమార్ ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అలాగే బాలికతో ప్యూన్ ఉన్న దృశ్యాలు ఆఫీస్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని నెజిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications
