చర్చిలో ఘోరం.. సిలువ మీదపడి ఫాదర్ మృతి.. మరణసందేశం ఇస్తుండగానే..
మనిషికి మరణం ఎప్పుడు.. ఎలా.. సంభవిస్తుందో అనేది ఎవ్వరూ చెప్పలేం.. మరణం ఎటు వైపునుంచి వస్తుందో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. తాజాగా ఈక్వెడార్ లోని ఓ చర్చిలో విషాదకరమైన ఘటన జరిగింది. జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసుకులకు సందేశం ఇస్తున్న క్రమంలో గోడకు ఉన్న ఓ భారీ శిలువ హఠాత్తుగా కుప్పకూలింది. ఆ శిలువ ఫాదర్ పై పడడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటన అక్టోబర్ 17న రాత్రి అవర్ లేడీ ఆఫ్ పర్పెచ్యువల్ హెల్ప్ అనే చర్చిలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తలపై జీసస్ సిలువ పడి ఫాదర్ చర్చిలోనే మరణించడంతో అక్కడ ఆందోళనకర, భయానక పరిస్థితులు నెలకున్నాయి.
A priest has reportedly been killed after a crucifix fell on him during a livestreamed church service in Ecuador. https://t.co/z6SWkTjrGM
— Bonaya Happi (@BonayaHappi) October 19, 2026
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరంలో లేడీ ఆఫ్ పర్పెచ్యువల్ హెల్ప్ అనే ప్రముఖ చర్చి ఉంది. ఈ చర్చిలో నిత్యం జీసస్ ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే రోజూ మాదిరిగానే అక్టోబర్ 17న రాత్రి సమయంలో ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న వారికి సందేశం ఇస్తున్నారు. జీవితంలోని అనిశ్చితి, మరణం గురించి మాట్లాడుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా దేవుడికి.. కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు తగినంత సమయాన్ని కేటాయించాలని సూచనలు చేశారు. దాంతోపాటు మనిషి జీవితం శాశ్వతం కాదని.. ఇతర విషయాల కంటే దేవుడితో గడిపే సమయానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సందేశాన్ని ఇస్తున్నారు.

అదే సమయంలో ఫాదర్ పాట్రిసియో అల్ఫ్రెడో సాంచెజ్ మొలినారి వెనుక గోడకు ఉన్న భారీ జీసస్ శిలువ ఒక్కసారిగా ఊడిపడి తలపై భాగంలో బలంగా తాకింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించినా.. తీవ్ర గాయాల కారణంగా ఫాదర్ తుదిశ్వాస విడిచారు. ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా సుమారు 27 నిమిషాల తర్వాత శిలువ ఊడి ఫాదర్ తలపై పడినట్లు స్పష్టమైంది. ఇక గ్వాయాక్విల్ ఆర్చ్ డయాసిస్ ఫాదర్ పాట్రిసియో మృతిని ధృవీకరిస్తూ సంతాపం ప్రకటించింది.












Click it and Unblock the Notifications
