టీమిండియా సెలెక్షన్ కమిటీలో భారీ మార్పులు: నూతన చీఫ్ సెలెక్టర్ గా

బీసీసీఐ సెలెక్షన్ ప్యానెల్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా.. చీఫ్ సెలెక్టర్ గా ఎంపికయ్యారు. అదే సమయంలో ఇతర సెలెక్టర్లను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. నూతనంగా టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను సెలెక్షన్ కమిటీలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు సెలెక్టర్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియడంతో ఈ మార్పులు సంభవించాయి.

అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ముంబై బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు తాజా ప్రకటన వెలువడించింది. రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. పురుషుల సెలెక్షన్ ప్యానెల్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆయనకు ఇదే మొదటిసారి. ప్రజ్ఞాన్ ఓఝా సహా మొత్తం అయిదుమంది సభ్యులతో కూడి పూర్తిస్థాయి సెలెక్షన్ కమిటీని బీసీసీఐ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఇందులో ప్రజ్ఞాన్ ఓఝా చీఫ్ సెలెక్టర్ గా నియమితులయ్యారు.

Pragyan Ojha named BCCI chief selector and Ramesh Powar inducted in selection panel and others

మాజీ క్రికెటర్లు శివ్ సుందర్ దాస్, రుద్ర ప్రతాప్ సింగ్, అజయ్ రాత్రా, రమేశ్ పొవార్ సభ్యులుగా నియమితులయ్యారు. రాబోయే కీలక అంతర్జాతీయ సిరీస్‌, టోర్నమెంట్లకు భారత జట్టును ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. టీమిండియా తరఫున 24 టెస్టులు ఆడిన అనుభవం ఉంది ప్రజ్ఞాన్ ఓఝాకు. అజిత్ అగార్కర్ హయాంలో సెలెక్షన్ కమిటీలో కూడా కీలక పాత్ర పోషించారు. అగార్కర్ గైర్హాజర్ సమయంలో తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ గా వ్యవహరించారు.

అందుకే దర్శిలో నామినేషన్ వేయలేకపోయాం: ఎమ్మెల్యే బూచేపల్లి
అందుకే దర్శిలో నామినేషన్ వేయలేకపోయాం: ఎమ్మెల్యే బూచేపల్లి

కాగా.. రమేష్ పొవార్ మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చారు. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన పొవార్‌కు కోచింగ్‌లో విస్తృతానుభవం ఉంది. గతంలో భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు కూడా. ముంబై, గుజరాత్ జట్లకు మెంటార్ గా పనిచేశారు. ఆయన హయాంలో విమెన్స్ టీమ్ ఆసియా కప్ విజేతగా నిలవడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సైతం సాధించింది.

అగార్కర్ అవుట్.. : టీమిండియా నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ గా.. !!
అగార్కర్ అవుట్.. : టీమిండియా నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ గా.. !!

2023 జూలై నుంచి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ ప్రత్యేకంగా అభినందించింది. అగార్కర్ నాయకత్వంలో భారత జట్టు అనేక ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఆయన హయాంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. భారత క్రికెట్ పురోగతిలో అగార్కర్ చూపిన కట్టుబడి, సహకారాన్ని బోర్డు ప్రశంసించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+