భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు సీజ్..!
పంజాబ్ పోలీసులు అమృత్‌సర్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్, దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాద ముఠా గుట్టురట్టు చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి నుంచి ఐఈడీ, పిస్టల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పాకిస్థాన్ కు చెందిన ఓ ఉగ్రవాది సాయంతో నిందితుడు భారత్ లో ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో గుర్తించారు అధికారులు.
పంజాబ్ అమృత్‌సర్ లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ బృందం ముందస్తు నిఘా సమాచారం మేరకు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రిమోట్ కంట్రోల్ తో పనిచేసే IED, విదేశీ పిస్టల్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఓ ఉగ్రవాది సాయంతో నిందితుడు దిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదే విషయాన్ని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్.. సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చేసిన ఈ భారీ ఉగ్ర కుట్రను పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

మరోవైపు పాకిస్థాన్ బోర్డర్ నుంచి భారత్ లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు అధికారులు.












Click it and Unblock the Notifications