పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన ఆందోళనకారులు: కత్తులు, ఆయుధాలతో వీరంగం
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని అమృత్సర్ అజ్‌నాలా పోలీస్ స్టేషన్ వద్ద యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా భారీ ఎత్తున ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. కత్తులు, తుపాకులతో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ దూసుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా నిశ్చేష్టులయ్యారు. ఇదంతా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని విడుదల చేయాలంటూ చేశారు వేర్పాటువాద మద్దతుదారులు.
పంజాబ్‌లోని వారిస్ పంజాబ్ దే మత సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ అనుచరులు ఈ భారీ ఆందోళన చేపట్టారు. అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు లవ్ ప్రీత్ తూఫాన్‌ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అతడి అనుచరులంతా మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ను ముట్టించారు. మినీ బస్సుపై భారీ సౌండ్ బాక్సులు పెట్టి.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కత్తులు, తుపాకులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌పై దండెత్తారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన భారికేడ్లు నిలువలేకపోయాయి. వందలాది మంది ఆందోళనకారులు వాటిని తోసుకుంటూ ముందుకెళ్లడంతో పోలీసులంతా చూస్తూ ఉండిపోయారు.

కేవలం రాజకీయ కుట్రతోనే లవ్ ప్రీత్ తూఫాన్ పై కేసు నమోదు చేశారని అమృత్ పాల్ సింగ్ ఆరోపించారు. కేవలం గంట లోపు కేసు రద్దు చేయకపోతే తర్వాత ఏం జరిగినా అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తామేం చేయలేమని వాళ్లనుకుంటున్నారేమో.. అందుకే బల ప్రదర్శన చేయాల్సి వచ్చిందని అమృత్ పాల్ సింగ్ తెలిపారు.
Separatist Khalistani Amritpal supporters captured Anjala Police station in Punjab.
— The Poll Lady (@ThePollLady) February 23, 2023
Communal riots will rise in India before general election 2024 from all opposition ruled states. Keep a close eye on Arvind Kejriwal.
pic.twitter.com/Qhii0ABN19
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో లవ్ ప్రీత్ తూఫాన్ ను విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా, వారిస్ పంజాబ్ దే సంస్థను దీప్ సిద్ధూ అనే వ్యక్తి స్థాపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందిన తర్వాత సంస్థ బాధ్యతలను అమృత్ పాల్ సింగ్ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications