సెప్టెంబర్ 7 వరకు స్కూళ్లకు సెలవులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా భారీ వరదల ధాటికి పలు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. రోడ్లు, కాలనీలు, ఇళ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రాష్ట్రాల్లో వరదల ధాటికి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. పశునష్టం, ఆస్తినష్టం కూడా వాటిల్లింది.
అటు పంజాబ్ ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను మూసివేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ ఏడో తేదీ వరకు మూసివేయాలని స్పష్టం చేశారు.

ఇక పంజాబ్ లోని భారీ వర్షాలకు 23 జిల్లాల్లో 1,400 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 3.5 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్, కపుర్తలా,పఠాన్ కోట్, గురుదాస్ పూర్, అమృత్ సర్, హోషియార్ పూర్, బర్నాలా జిల్లాల్లో NDRF, ఆర్మీ, BSF.. ఇతర సహాయక బృందాలు రక్షణ, సహాయక చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications