Encounter: హైప్రొఫైల్ పొలిటికల్ మర్డర్‌ కేసులో నిందితుడి కాల్చివేత

చండీగఢ్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధు మూసెవాలా హత్యకేసు ఉదంతం తాజాగా తెరమీదికి వచ్చింది. వార్తల్లోకి ఎక్కింది. పంజాబ్‌లో సంభవించిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ ఒకరు హతం అయ్యాడు. సిద్ధు మూసేవాలా హత్యకేసులో అతణ్ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్నారు పోలీసులు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఇతర సభ్యులు ఇంకా సంఘటన స్థలంలోనే ఉండటం వల్ల ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

అమృత్‌సర్ సమీపంలోని చీచా భక్నా గ్రామంలో ఈ గ్యాంగ్ తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పంజాబ్ పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ ఈ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించింది. జగ్రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా సహా మరికొందరు అక్కడే తలదాచుకున్నట్లు నిర్ధారించారు. పోలీసులు చుట్టుముట్టిన విషయం తెలుసుకోగానే మన్ను కుస్సా తొలుత పోలీసులపై ఏకే 47తో కాల్పులు జరిపాడు.

దీనితో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో జగ్రూప్ సింగ్ రూపా, మన్ను కుస్సా, దీపక్ ముండీ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో జగ్రూప్ సింగ్ హతం అయ్యాడు. మన్ను కుస్సా, దీపక్ ముండి సంఘటన స్థలం నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. వారి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో వారితో పాటు ఉన్న మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Punjab: Sidhu Moose Wala Murder Suspect Jagroop Singh Roopa was killed in an encounter

కాగా- ఈ గ్యాంగ్ మొత్తం అటారీ సరిహద్దుల వైపు పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్థానికంగా వారు దౌర్జన్యాలకు పాల్పడటం, తుపాకులతో బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంగా సిద్ధు మూసేవాలా హత్యతో ప్రమేయం ఉన్న గ్యాంగ్‌గా అనుమానించారు. వారిని అరెస్ట్ చేయడానికి చీచాభక్నా గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన సమాచారం తెలిసిన వెంటనే గ్యాంగ్ కాల్పులు దిగడంతో ఎన్‌కౌంటర్ అనివార్యమైనట్లు ఎస్‌హెచ్ఓ సుఖ్‌బీర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+