'లెస్బియన్ ఎఫైర్' కోసం అక్కాచెల్లెళ్ల వేధింపులు.. మనస్తాపంతో ఆత్మహత్య
'లెస్బియన్ ఎఫైర్' ఒత్తిడికి తాళలేక పంజాబ్ లోని చండీగఢ్ సమీపంలో ఉన్న కర్నాల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
చండీగఢ్: చదువుకునే వయసులో 'సెక్స్' ఆలోచనల చుట్టూ భ్రమిస్తున్న కొంతమంది యువత.. అటు చదువును నిర్లక్ష్యం చేయడంతో పాటు.. తోటివాళ్ల మీద వేధింపులకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి ఈ వేధింపులు ఆత్మహత్యల దాకా దారితీస్తుండటం తీవ్రంగా కలవరపెడుతోన్న అంశం.
తాజాగా 'లెస్బియన్ ఎఫైర్' ఒత్తిడికి తాళలేక పంజాబ్ లోని చండీగఢ్ సమీపంలో ఉన్న కర్నాల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతోన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. బాధితురాలిని లైంగికంగా వేధించారని పోలీసులు తెలిపారు.

తమతో అసహ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు.. వేధింపులకు గురిచేశారని పోలీసులు చెప్పారు. సదరు అక్కాచెల్లెళ్లపై బాధితురాలు స్కూల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను వారి గది నుంచి వేరే గదికి మార్చారు.
అయితే ఏమైందో తెలియదు గానీ.. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని చనిపోయిందని పోలీసులు వివరించారు. విద్యార్థిని ఆత్మహత్యపై ఇతర విద్యార్థినుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications