వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్ ధామి: ఎన్నికల్లో ఓడినా ఆయన వైపే మొగ్గు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుష్కర్ సింగ్ ధామి మరోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. సోమవారం బీజేపీ ఉత్తరాఖండ్ శాసనసభ పక్ష నేతగా ధామి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మార్చి 23న పుష్కర్ సింగ్ ధామి రెండోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ పరిణామాన్ని ధృవీకరించారు రక్షణ మంత్రి, ఉత్తరాఖండ్ బిజెపి కేంద్ర పరిశీలకుడు రాజ్‌నాథ్ సింగ్. "పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను, అతని నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను' అని రాజ్‌నాథ్ అన్నారు.

Pushkar Singh Dhami, Who Lost Election, To Return As Uttarakhand Chief Minister

ఉత్తరాఖండ్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, మీనాక్షి లేఖి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషి హాజరైన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ధామి పేరు ఖరారు చేశారు. కాగా, ధామీతో పాటు చౌబత్తఖాల్ ఎమ్మెల్యే సత్పాల్ మహరాజ్, శ్రీనగర్ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీలు ఈ అత్యున్నత పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి, వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానంలో పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు.

ఖతిమా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామి మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఏది ఏమైనప్పటికీ, బిజెపిలోని ఒక వర్గం నాయకులు ధామీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి కారణమయ్యారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టిని అందించడానికి ఆయన పూర్తి ఐదేళ్ల పదవీకాలం పొందేలా ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నారని పీటీఐ వెల్లడించింది.
జూలై 2021లో పదవీకాలం ముగిసే సమయానికి తీరత్ సింగ్ రావత్ స్థానంలో ధామిని ఎన్నుకున్నారు.

English summary
Pushkar Singh Dhami, Who Lost Election, To Return As Uttarakhand Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X