Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుష్పా ఫ్యామిలీ అరాచకం, అందరి ముందు వివాహిత మహిళ చీర లాగేసి ఎంతపని చేశారంటే ?

బెంగళూరు: ఇంటి ముందు తాగునీళ్లు పోయే విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో ఓ వ్యక్తి అందరిముందు వివాహిత మహిళ చీర పట్టుకుని లాగడంతో ఆమె మనస్తాపం చెందింది. అందరి ముందు తన పరువుపోయిందని ఆవేదన చెందిన ఆ గృహిణి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ వ్యక్తి మహిళ చీరను లాగేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలూకా కచకనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

యాదగిరి జిల్లా హున్సగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతదేహాన్ని ఉంచిన గ్రామస్తులు, మహిళ కుటుంబీకులు ఆందోళన చేశారు. మాకు న్యాయం చేయాలని, చీర లాగిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ విజయలక్ష్మి(30) అని పోలీసులు అన్నారు. తాగునీటి కోసం స్థానికులు కొట్లాడుకున్నారు. అదే రోజు సాయంత్రం గృహిణి విజయలక్ష్మి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది.

వెంటనే విజయలక్ష్మిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. చికిత్స ఫలించక విజయలక్ష్మి మృతి చెందింది. విజయలక్ష్మి మృత దేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. పోలీసులు విజయలక్ష్మి బంధువులు, గ్రామస్తులకు నచ్చచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. యాదగిరి జిల్లా ఎస్పీ వచ్చే వరకు బాధితురాలి కుటుంబ సభ్యులు శాంతంచలేదు.

ఇరుగుపొరుగు వారు చెత్త ఊడ్చడం, మురుగునీరు పారేయడం, తాగునీరు పట్టుకునే విషయంలో తరచూ విజయలక్ష్మితో గొడవ పడేవాడని ఆమె బంధువులు ఆరోపించారు. అయితే ఇటీవల ఇంటి ముందు తాగు నీళ్లు వదిలే విషయంలో ఇరుగుపొరుగు వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో జరుగుతున్న సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తి విజయలక్ష్మి అనే మహిళను పట్టుకుని అందరిముందు ఈడ్చుకెళ్లాడు.

Pushpa family where a married woman pulled her sari in front of everyone in the street for drinking water

తరువాత రెచ్చిపోయిన నిందితుడు అందరి ముందు విజయలక్ష్మి చీర లాగడంతో ఆమె అర్దనగ్నంగా ఆమె బంధువుల ఇంటిలోకి పరుగు తీసింది. తనకు అందరి ముందు అవమానం జరిగిందని, స్థానికులు కూడాపట్టించుకోలేదని ఆవేదనతో విజయక్ష్మి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని అరెస్ట్ చేయాలంటూ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులైన కచకనూరు గ్రామానికి చెందిన ఇంద్రమ్మ, హనమంతరాయ, పుష్పా, శశికళలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న తరువాత నిందితులు అందరూ పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+