భారతే మా భాగ్యము: 100 విమానాలను ఆర్డర్ చేసిన ఖతార్ ఎయిర్‌వేస్!

Subscribe to Oneindia Telugu

దుబాయి: ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన సేవలను తమ ప్రయాణికులకు అందిస్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ భారతదేశంపై ప్రముఖంగా దృష్టి సారిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పాలసీల విషయంలో ఖతార్ ఎయిర్‌వేస్‌తోపాటు ఇతర విమానయాన సంస్థలుకూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఒకడుగు ముందుకేసి.. భారత్‌ కోసం దాదాపు 100 కొత్త జెట్‌ లైనర్స్‌ను ఆర్డర్‌ చేయనుంది.

ప్రధాని మోడీపై నమ్మకం..

ప్రధాని మోడీపై నమ్మకం..

భారత్‌లో దేశీయ విమానయానంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఇస్తారనే నమ్మకంతో ఉన్నట్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ అల్‌ బకర్‌ తెలిపారు.

భారత్‌లో విమానయాన సంస్థ ఏర్పాటు..

భారత్‌లో విమానయాన సంస్థ ఏర్పాటు..

భారత్‌లో కొత్త ఎయిర్‌లైన్స్‌ను స్థాపించడానికి అనుమతుల గురించి తెలుసుకొని టెండర్‌ వేస్తామని చెప్పారు. ఈ ఏడాదిలో ప్రక్రియ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
భారత్‌లో విమానయాన సంస్థను స్థాపించనున్నట్లు అల్‌ బకర్‌ గత నెలలోనే వెల్లడించారు.

వంద విమానాలు..

వంద విమానాలు..

వంద విమానాలతో భారత్‌లో విమానయాన వ్యాపారంలో ప్రవేశిస్తామని ఖతార్ ఎయిర్‌వేస్ పేర్కొంది. ఇప్పటికే ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ భారత్‌లోని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇండియా లిమిటెడ్‌లో 24శాతం వాటా తీసుకుంది.

ఇతర సంస్థలు కూడా..

ఇతర సంస్థలు కూడా..

ఇది ఇలా ఉండగా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ఏషియా విమానయాన సంస్థలకు కూడా భారత ఎయిర్‌లైన్స్‌లో దాదాపు 49 శాతం వాటాలున్నాయి. అయితే విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ఇప్పటికైతే వంద శాతం పెట్టుబడులకు అవకాశం లేదు. కానీ, భవిష్యత్తులో ఉంటుందనే ఆలోచనతోనే ఖతార్ తోపాటు పలు ఎయిర్‌లైన్స్‌ భారతదేశంలో వ్యాపారం తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముమ్మరయత్నాల్లో ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Qatar Airways Ltd may order 100 new jetliners before the end of this year to power its push into India and also plans to announce two new routes to the UK even as the country prepares to exit the European Union, chief executive officer Akbar Al Baker said.
Please Wait while comments are loading...