కుక్కలను పెంచుకుంటున్నారా? బి కేర్ ఫుల్

Kerala dog menace: కేరళలో వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుక్క కాటు కేసులు, రేబిస్ మరణాలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. కుక్కకాటు, రేబిస్ మరణాలపై హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రేబిస్ మరణాలు రాష్ట్ర విపత్తుగా ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రజల్లో పెరుగుతున్న భయాందోళనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవట్లేదని అభిప్రాయపడింది.

Rabies deaths raising in Kerala as the State Grappling with Stray Dog Menace

ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 1.31 లక్షల మంది కుక్క కాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3.16 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 25 మంది రేబిస్ కారణంగా మరణించారు.

2021 నుండి 2024 మధ్య 89 రేబిస్ మరణాలు సంభవించగా, వారిలో 18 మంది టీకాలు తీసుకున్న వాళ్లూ ఉండటం ఆందోళనకంగా మారింది. ప్రత్యేకించి- కొట్టాయం, తిరువనంతపురం, పథనంథిట్ట జిల్లాల్లో కుక్క కాటు తీవ్రంగా ఉంటోంది. ముగ్గురు పిల్లలు మరణించారు. దీంతో సీనియర్ అడ్వొకేట్ కళత్తూర్ జైసింగ్ రంగంలోకి దిగారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది జనవరి నుండి మే మధ్య కాలంలో రేబిస్ కారణంగా 16 మంది మరణించగా.. వారిలో అయిదుమంది ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం కుక్క కాటుతో మరణించిన వారిలో తొమ్మిది మందికి టీకాలు వేసినట్లు గుర్తించారు.

వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల టీకాలు పనిచేయట్లేదని అధికారులు భావిస్తున్నారు. రేబిస్ వైరస్‌లో మార్పులు సంభవించి ఉండవచ్చని, ప్రస్తుత టీకాలకు వాటికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీధి కుక్కల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను స్థానిక సంస్థలు సరిగ్గా వినియోగించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్లలో రూ. 98.93 కోట్ల నిధులను కేటాయించగా.. ఇందులో రూ. 13.59 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, దీనివల్ల సమస్య మరింత తీవ్రమైందని 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వీధి కుక్కల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రీవెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ రూల్స్ 2023లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.

వ్యాధులను వ్యాప్తి చేసే లేదా తీవ్రంగా గాయపడిన జంతువులకు ఈ నిబంధనలోని సెక్షన్ 8 ప్రకారం ఉపశమనం కల్పిస్తారు. వీధి కుక్కల నియంత్రణకు మొబైల్ యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఎం.బి. రాజేష్ తెలిపారు.

బ్లాక్ స్థాయిలో 152 పోర్టబుల్ ABC యూనిట్లను ఏర్పాటు చేస్తామని, ఒక్కో యూనిట్‌కు రూ. 28 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి యూనిట్ రోజుకు 25 స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు చేయగలదని, అయిదు రోజుల పాటు సంరక్షణ అందిస్తుందని చెప్పారు.

నెడుమంగడ్ మునిసిపాలిటీలో పోర్టబుల్ ఏబీసీ యూనిట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు, మరో ఏడు యూనిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి జే చించురాణి తెలిపారు. వీధి కుక్కలకు వచ్చే నెలలో, పెంపుడు కుక్కలకు సెప్టెంబర్‌లో సామూహిక టీకాలు వేయనున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+